ప్రస్థానం – ట్రైలర్
తెలుగు ప్రస్థానంకు రీమేక్‌గా రూపొందుతున్న ప్రస్థానం (ఎర్న్ ది లెగసీ) ట్రైలర్ రిలీజ్.. సెప్టెంబర్ 20 విడుదల..

తెలుగు ప్రస్థానంకు రీమేక్‌గా రూపొందుతున్న ప్రస్థానం (ఎర్న్ ది లెగసీ) ట్రైలర్ రిలీజ్.. సెప్టెంబర్ 20 విడుదల..
సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ నటించిన ప్రస్థానం మూవీ బాలీవుడ్‌లో.. ప్రస్థానం (ఎర్న్ ది లెగసీ) పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దేవా కట్టా ఈ సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. సంజయ్ దత్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రస్థానం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాడు. సంజయ్ దత్ సెటిల్డ్ పర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. దేవ కట్టా స్టోరీలోని సోల్ మిస్ కాకుండా బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంజయ్ దత్ సమర్పణలో ఆయన భార్య మాన్యతా దత్ నిర్మిస్తుంది.
Read Also : కేజీఎఫ్ 2 షూటింగ్ నిలిపి వేయాలంటూ కోర్టు తీర్పు..
మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్, చుంకీ పాండే, అలీ ఫాజల్, సత్యదేవ్ దూబే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రస్థానం (ఎర్న్ ది లెగసీ) రిలీజ్ కానుంది. మ్యూజిక్ : ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : సేతు (సత్యజిత్ పాండే), ఎడిటింగ్ : రామేశ్వర్ S. భగత్.