Prema Dairilo Chivari Pagelu : ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’.. త్వరలో రాబోతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. (Prema Dairilo Chivari Pagelu)
Prema Dairilo Chivari Pagelu
Prema Dairilo Chivari Pagelu : పి.వి.అర్జున్ యాదవ్, అదితి జంటగా తెరకెక్కుతున్న సినిమా ప్రేమ డైరీలో చివరి పేజీలు. శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి.నరసింహ యాదవ్ నిర్మాణంలో హరికృష్ణ పామంజి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఈ సినిమా రానుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా పాటలు, గ్లింప్స్ రిలీజయి మెప్పించాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.
Also Read : Ramani Kalyanam : 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..
ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, అతని నటన ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తాయి అని, లవర్ బాయ్‌గా గుర్తింపు వస్తుందని, హీరోగా ఈ సినిమాతో అతనికి టాలీవుడ్ లో గుర్తింపు వస్తుందని మూవీ యూనిట్ అంటున్నారు. లవ్ స్టోరీ కావడంతో హీరో – హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా మెప్పిస్తుంది. ప్రేమ, భావోద్వేగాలతో ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించమని, క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టేలా ప్రేమ డైరీలో చివరి పేజీలు ఉంటుందని, త్వరలోనే థియేటర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని డైరెక్టర్ తెలిపారు.
