Tollywood : జేజమ్మ, అతిలోక సుందరి పాత్రలకు ఫస్ట్ ఛాయస్ ఆ హీరోయిన్ అంటా.. తెలుసా?
జగదేక వీరుడు అతిలోక సుందరి, అరుంధతి వంటి సూపర్ హిట్టు సినిమాల్లో నటించే అవకాశం ముందుగా ఆ హీరోయిన్ కి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Prema is the first choice for Jagadeka Veerudu Athiloka Sundari Arundhati
Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో జగదేక వీరుడు అతిలోక సుందరి, అరుంధతి ఎంతటి విజయాన్ని అందుకున్నాయి అందరికి తెలుసు. ఈ రెండు సినిమాలు రెండు వైవిధ్యమైన కథనాలు. ఒకటి దేవకన్య కథ అయితే మరొకటి దెయ్యాల కథ. 1990 లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటాసి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి.. దేవతలరాజు ఇంద్రుడి కూతురిగా నటించింది. దేవకన్య అంటే ఇలానే ఉంటుందేమో అనే ఒక ముద్రని తెలుగు ఆడియన్స్ లో వేసింది శ్రీదేవి.
KGF 3 : చరిత్ర సృష్టించిన KGF 2కు వన్ ఇయర్.. పార్ట్ 3పై అప్డేట్ ఇచ్చిన హోంబలె ఫిలిమ్స్..
ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమా హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఇప్పటికి టాలీవుడ్ లో బెస్ట్ హారర్ ఫిల్మ్ ఏది అంటే అరుంధతి అనే చెబుతారు. అంతేకాదు ఈ సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ అప్పటికి చాలా హై లెవెల్. ఈ సినిమాతో పాటు అదే ఏడాది మగధీర కూడా రిలీజ్ అయ్యింది. గ్రాఫిక్స్ విషయంలో అరుంధతి, మగధీరతో పోటీ పడింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క నటించి నటిగా మంచి పేరుని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూవీలోని జేజమ్మ పాత్రలో తన నటన అందర్నీ కట్టి పడేసింది.
కాగా ఈ జేజమ్మ, అతిలోక సుందరి పాత్రలకు ఫస్ట్ ఛాయస్ వీరిద్దరూ కాదట. ఈ అవకాశం మొదటిగా హీరోయిన్ ప్రేమ (Prema) ని వరించింది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవి’ సినిమాతో ప్రేమ తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోడి రామకృష్ణ అరుంధతి సినిమా అనుకున్నప్పుడు జేజమ్మ పాత్ర కోసం ప్రేమని సంప్రదించాడట. అయితే ప్రేమ వేరే కమిట్‌మెంట్స్ తో ఉండడంతో మిస్ అయ్యిందట. జేజమ్మ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ప్రేమ పెద్దగా ఫీల్ అవ్వలేదట. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు బాగా ఫీల్ అయ్యిందట. ఈ సినిమా కూడా ఇతర కమిట్‌మెంట్స్ వల్ల మిస్ అయ్యిందట.