83 – కపిల్ భార్య రోమి దేవ్‌గా దీపికా

‘83’ చిత్రంలో కపిల్ దేవ్ భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొనే..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 07:31 AM IST
83 – కపిల్ భార్య రోమి దేవ్‌గా దీపికా

Updated On : February 19, 2020 / 7:31 AM IST

‘83’ చిత్రంలో కపిల్ దేవ్ భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొనే..

బాలీవుడ్‌లో గతకొంత కాలంగా రీమేక్స్, బయోపిక్స్ హవా నడుస్తోంది. 1983వ సంవత్సరం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. 1983లోభారత్ జట్టు క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం.. ‘83’.. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్  కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియా (రోమి దేవ్) పాత్రలో దీపికా పదుకొనే కనిపించనుంది.

ఇటీవల విడుదల చేసిన రణ్‌వీర్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీపికా లుక్ రిలీజ్ చేశారు. కపిల్ భార్య రోమి క్యారెక్టర్‌లో దీపికా మేకోవర్ ఆకట్టుకుంటోంది. క్రికెట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌ దేవ్ వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచి, ఆయన విజయంలో తన వంతు సాయం చేసిన రోమి దేవ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

అందుకే కపిల్ భార్య పాత్ర కోసం దీపికాను సెలెక్ట్ చేసున్నారు మేకర్స్. 2020 ఏప్రిల్‌ 10న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ‘83’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తుండగా.. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, విబ్రి మీడియా, ఫాంటోమ్ ఫిల్మ్స్, కేఎ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  

Presenting Deepika Padukone as Romi Dev in 83