Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ “మా వందే”.. మోదీ పాత్రలో జనతా గ్యారేజ్ నటుడు
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన (Maa Vande)వచ్చింది. సెప్టెంబర్ 17 మోదీ 75న పుట్టినరోజు సందర్భంగా ఈ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.

Prime Minister Modi's biopic "Maa Vande" movie begins
Maa Vande: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 17 మోదీ 75న పుట్టినరోజు సందర్భంగా ఈ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు “మా వందే”(Maa Vande) అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఈ బయోపిక్ లో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నాడు. ఈ నటుడు తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి వంటి సినిమాల్లో నటించాడు.
Band Melam: కోర్టు జంట కొత్త సినిమా.. బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్ రిలీజ్
ఇక మా వందే సినిమా షూటింగ్ త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం. ఈ సినిమాను నిర్మిస్తుండగా.. క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ బయోపిక్ లో నరేంద్ర మోదీ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు మేకర్స్. టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఆయన ప్రయాణాన్ని కళ్ళకు కట్టే విధంగా తెరకెక్కించబోతున్న. అలాగే మోదీకి తన తల్లి హీరాబెన్ మోదీకి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను కూడా తెరపై హృద్యంగా చూపించబోతున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి బాహుబలి సినిమాకు అద్భుతమైన కెమెరా వర్క్ అందించిన కేకే సెంథిల్ కుమార్ పని చేయబోతున్నారు.
ఇక కేజీఎఫ్, సాలార్ లాంటి భారీ సినిమాలకు పని చేసిన రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ కాస్ట్ అండ్ క్ర్యూ పని చేయబోతున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలో విడుదల చేయనున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో మోదీ జీవితం చాలా మందికి స్ఫూర్తిగా నిలవాలనే కారణంతోనే ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.