Prince Cecil : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫొటోలు వైరల్..
నేడు ప్రిన్స్ సిసిల్ తను ప్రేమించిన అమ్మాయి సాయి ప్రతిమని పెళ్లి చేసుకున్నాడు. (Prince Cecil)
Prince Cecil
Prince Cecil : పలు సినిమాలు, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు నటుడు ప్రిన్స్ సిసిల్. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ప్రిన్స్ తనకు కాబోయే భార్యని పరిచయం చేసాడు. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న సాయి ప్రతిమ అనే అమ్మాయికి ఇటీవల పేరెంట్స్, ఫ్యామిలీ అందరి ముందు పెళ్లి చేసుకుందామా అంటూ మోకాళ్లపై కూర్చొని అడిగిన వీడియోని షేర్ చేసి తనకు కాబోయే భార్యని పరిచయం చేసాడు.
నేడు ప్రిన్స్ సిసిల్ తను ప్రేమించిన అమ్మాయి సాయి ప్రతిమని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట సాంప్రదాయ పెళ్లి వేడుకలో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఓ రెండు ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసాడు ప్రిన్స్. దీంతో ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..

