Prithviraj Sukumaran : ఆ సినిమా రీమేక్ చేసారా.. నాకు తెలీదు.. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాలపై పృథ్విరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంటర్వ్యూలో యాంకర్ మీ సినిమాలు ఇక్కడ అయ్యప్పన్ కోషియం భీమ్లా నాయక్ గా, లూసిఫర్ గాడ్ ఫాదర్ గా, ముంబై పోలీస్ హంట్ సినిమాగా రీమేక్ అయ్యాయి. అవి చూసారా అని అడగ్గా పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..

Prithviraj Sukumaran Interesting Comments on His Movies Remakes in Telugu
Prithviraj Sukumaran : మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పటికప్పుడు కొత్త రకం కథలతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తాడు. మలయాళంలో సూపర్ ఫామ్ లో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే పరిశ్రమల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన పృథ్విరాజ్ త్వరలో ‘ఆడు జీవితం : ది గోట్ లైఫ్'(Aadu Jeevitham The Goat Life) అనే సినిమాతో రాబోతున్నాడు.
‘ఆడు జీవితం : ది గోట్ లైఫ్ సినిమా పాన్ ఇండియా వైడ్ మార్చ్ 28 రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు పృథ్విరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో పాటలు అనేక ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగులో రీమేక్ అయిన పృథ్విరాజ్ సుకుమారన్ సినిమాల గురించి మాట్లాడారు.
ఇంటర్వ్యూలో యాంకర్ మీ సినిమాలు ఇక్కడ అయ్యప్పన్ కోషియం భీమ్లా నాయక్ గా, లూసిఫర్ గాడ్ ఫాదర్ గా, ముంబై పోలీస్ హంట్ సినిమాగా రీమేక్ అయ్యాయి. అవి చూసారా అని అడగ్గా పృథ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. నా ముంబై పోలీస్ సినిమా తెలుగులో రీమేక్ అయిందా? నాకు ఈ విషయం తెలీదు. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాలు అయితే తెలుసు. కానీ ఆ సినిమాలు చూడలేదు. కొన్ని సీన్స్ మాత్రం చూసాను. ఇప్పుడు రీమేక్స్ చేయాల్సిన అవసరం రాదు. ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి, ఇకముందు రీమేక్ సినిమాలు ఉండకపోవచ్చు అని అన్నారు. దీంతో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : RRR Movie : RRR ప్రభంజనానికి రెండేళ్లు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి.. RRR గురించి ఆసక్తికర విషయాలు..
పృథ్విరాజ్ చెప్పిన మాట కూడా నిజమే. కరోనా తర్వాత పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. రీమేక్ అంటూ ఎక్కువ ఖర్చు చేసి రిజల్ట్ ఏం అవుతుందో తెలియని పరిస్థితిలో కంటే డబ్బింగ్ చేసి, ఒరిజినాలిటీని ప్రేక్షకులకు అందించడం బెటర్. అంతేకాక ఇప్పుడు అన్ని సినిమాలని ఓటీటీలో చూసేస్తున్నారు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా.