RRR Movie : RRR ప్రభంజనానికి రెండేళ్లు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి.. RRR గురించి ఆసక్తికర విషయాలు..

2022 మార్చ్ 25న రిలీజయిన RRR సినిమా నేటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది. RRR సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

RRR Movie : RRR ప్రభంజనానికి రెండేళ్లు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి.. RRR గురించి ఆసక్తికర విషయాలు..

Rajamouli Ram Charan NTR RRR Movie Completed Two Years Interesting Facts about RRR Movie

Updated On : March 25, 2024 / 9:44 AM IST

RRR Movie : బాహుబలి(Bahubali) సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించి మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి(Rajamouli) ఆ తర్వాత RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. RRR సినిమాతో ఎవరూ ఊహించని ఆస్కార్(Oscar) అవార్డుని తెలుగు పాటకి తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటికి RRR సినిమా రిలీజయి రెండేళ్లు అవుతుంది. ఇప్పటికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా RRR పేరు వినిపిస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే జపాన్ లో RRR సినిమా హవా, రాజమౌళి హంగామా చూసాం. 2022 మార్చ్ 25న రిలీజయిన RRR సినిమా నేటికి రెండేళ్లు పూర్తి చేసుకుంది. RRR సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

#2017 నవంబర్ 18న రాజమౌళి ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఉండగా.. RRR అనే కాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. అక్కడి నుంచి RRR ప్రయాణం మొదలైంది.

#నిర్మాత దానయ్య రాజమౌళికి 2006 లోనే ఓ సినిమాకు అడ్వాన్స్ ఇస్తే ఇచ్చిన మాట కోసం ఇన్నేళ్ల తర్వాత ఆయనకు ఇంత భారీ సినిమా చేసిపెట్టాడు రాజమౌళి.

#కరోనా కారణంగా RRR సినిమా షూటింగ్ అనేక సార్లు వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ ని కూడా డేట్స్ అనౌన్స్ చేసి పలు మార్లు వాయిదా వేశారు.

#2022 మార్చి 25న RRR సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

#RRR అని వట్కింగ్ టైటిల్ అనుకున్నా చివరికి దాన్ని రౌద్రం, రణం, రుధిరం (Rise Roar Revolt) అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.

# మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరూ కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే ఎలా ఉంటుంది అని ఊహాత్మక కథతో, అదిరిపోయే యాక్షన్స్ తో చరణ్, ఎన్టీఆర్ లతో భారీ సినిమాగా తెరకెక్కించారు.

#RRR సినిమా బడ్జెట్ దాదాపు 550 కోట్లు. కరోనా కారణంగా కూడా సినిమా బడ్జెట్ కొంత పెరిగింది. ఇక ప్రమోషన్స్ కి దాదాపు 50 కోట్లు ఖర్చు చేసారని సమాచారం.

#RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 1400 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read : Kamal Haasan : ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 కూడా షూట్ అయిపోయిందా.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్..

#థియేట్రికల్ రిలీజ్ తర్వాత RRR సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయి కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ తోనే RRR సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. అన్ని దేశాల నుంచి నెట్‌ఫ్లిక్స్ లో RRR చూసి ప్రశంసలు వచ్చాయి.

#RRR సినిమాకు వస్తున్న ఆదరణ చూసి మూవీ యూనిట్ మరోసారి RRR ప్రమోషన్స్ మొదలుపెట్టి ప్రపంచ వేదికలపైకి తీసుకెళ్లింది.

#ప్రపంచవ్యాప్తంగా RRR పలు కేటగిరీల్లో 131 నామినేషన్స్ లో నిలిచింది. ఈ నామినేషన్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్కార్ అవార్డుతో సహా మొత్తం 60 అవార్డులు అందుకొని విజేతగా నిలిచింది.

# బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకొని మొదటి ఇండియన్ సాంగ్ గా నాటు నాటు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఆస్కార్ అందుకున్న మొదటి తెలుగు వాళ్ళుగా కీరవాణి, చంద్రబోస్ సరికొత్త రికార్డ్ సెట్ చేసారు.

#ఆస్కార్ క్యాంపైన్ ఖర్చు 8.5 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం.

#RRR జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ సెట్ చేసింది. 24 ఏళ్ళ పాటు జపాన్ లో రజినీకాంత్ పేరు పై ఉన్న రికార్డుని కొల్లగొట్టడమే కాకుండా, జపాన్ లో 18 మార్వెల్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. జపాన్ లో దాదాపు 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది RRR.

#RRR సినిమాకు గాను స్టీవెన్ స్పిల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్‌.. లాంటి హాలీవుడ్ దిగ్గజాల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ తో పాటు పలు దేశాల సినీ ప్రముఖులు, అన్ని రంగాల ప్రముఖులు RRR ని చూసి రాజమౌళిని, టీంని అభినందించారు.

#హాలీవుడ్ తో పాటు వేరే దేశాల్లో RRR సినిమా గురించి, ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి గురించి ప్రత్యేక వార్తలు వచ్చాయి.

#ఇక RRR సక్సెస్, ఆస్కార్ తర్వాత మూవీ టీం పలు మార్లు స్పెషల్ పార్టీలు చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఈ టీంకి పార్టీలు ఇచ్చారు. ఇక సన్మానాలకైతే కొదువే లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపై RRR టీం సన్మానంలు అందుకున్నారు.

#2023 సంవత్సరానికి టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ లో రాజమౌళి పేరు సాధించారు.

#ఇక ఆస్కార్ సాధించిన నాటు నాటు క్రేజ్ ఏ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా పాకిందో అందరికి తెలిసిందే. చాలా దేశాల్లో ఈ పాట బాగా వైరల్ అయింది. నాటు నాటు పాటకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు కాళ్ళు కదిపి స్టెప్పులు వేశారు. ఎంతోమంది ప్రముఖులు కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేశారు.

#ఈ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. హాలీవుడ్ లో సైతం ఇంటర్వ్యూలు చేసారు.

#ఇక రాజమౌళి అయితే RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైపోయారు. తన నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి RRR వల్ల.

Also Read : Gayathri Simhadri : వైరల్ అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్ కొత్త నటి.. మోనిత పాత్రలో? ఎవరీమె?

ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఇంకా ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి RRR అనే ఓ అద్భుతమైన సినిమాని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచి రికార్డులు, రివార్డులు, అవార్డులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటికి RRR సినిమా రిలీజయి రెండేళ్లు అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో RRR ట్రెండింగ్లో ఉంది.

Rajamouli Ram Charan NTR RRR Movie Completed Two Years Interesting Facts about RRR Movie