Prithviraj Sukumaran : సారీ రాజమౌళి.. నీ కండిషన్స్ నా దగ్గర కుదరవు అంటున్న హీరో..
మహేష్ బాబు కూడా వారణాసి సినిమాకు అదే కండిషన్ పాటిస్తున్నాడు.(Prithviraj Sukumaran)
Prithviraj Sukumaran
Prithviraj Sukumaran : రాజమౌళి సినిమా చేస్తున్నారంటే బోలెడన్ని కండిషన్స్ ఉంటాయని అందరికి తెలిసిందే. తన సినిమాలో పనిచేసే వాళ్లకు చాలా రూల్స్ పెడతారు రాజమౌళి. ముఖ్యంగా మెయిన్ లీడ్స్ గా చేసే వాళ్లకు తన సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా చెయ్యకూడదు, మధ్యలో వేరే సినిమాకు వెళ్ళకూడదు అనే కండిషన్ ఉంటుంది. మన హీరోలంతా ఆ కండిషన్ పాటించాల్సిందే. ఇప్పుడు మహేష్ బాబు కూడా వారణాసి సినిమాకు అదే కండిషన్ పాటిస్తున్నాడు.
అయితే వారణాసి సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం రాజమౌళి కండిషన్స్ తన దగ్గర కుదరవు అంటున్నాడు. మలయాళ హీరోలు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తారని తెలిసిందే. పృథ్వీరాజ్ రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నా తన సినిమాలను మాత్రం ఆపట్లేదు. 2026లో ఇప్పటికే రెండు సినిమాల ద్వారా పలకరించారు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
Also Read : Sumanth : అసలు ఆ రెండు సినిమాలు చేసి ఉంటేనా.. ఈ హీరో కెరీర్ ఇంకోలా ఉండేది..
2026 మొదట్లో పళ్ళిచట్టంబి సినిమాలో గెస్ట్ పాత్రలో మెప్పించాడు పృథ్వీరాజ్. ఇటీవలే జులైలో ఐ, నో బడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో ఆగస్టులో ఖలీఫా సినిమాతో రాబోతున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు పృథ్వీరాజ్. రాజమౌళి సినిమా చేస్తున్నా కూడా, ఇంకా ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వకపోయినా ఇలా వరుసగా తన సినిమాలు చేస్తున్న పృథ్వీరాజ్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళికి ఈ మలయాళ హీరో ఏం చెప్పి ఒప్పించాడో అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి రాజమౌళి కండిషన్స్ మన తెలుగు హీరోల దగ్గర పనిచేసినట్టు మలయాళ హీరోల దగ్గర మాత్రం పనిచేయట్లేదు.
