Priya Bhavani Shankar: ప్రియా భవానీ ప్రేమలో పడిందట!

ప్రియా భవాని శంకర్.. తమిళ తెరపై బిజీగా ఉండే యువ నటీమణులలో ఒకరు. ఆమె ఇప్పుడు ప్రేమలో పడిందంట. ఈ విషయాన్ని ప్రియానే స్వయంగా వెల్లడించారు. సోషల్‌‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియా భవాని, ఇటీవలె లైవ్‌లో నెటిజన్లతో సంభాషించింది.

Priya Bhavani Shankar: ప్రియా భవానీ ప్రేమలో పడిందట!

1

Updated On : June 20, 2021 / 8:58 PM IST

Priya Bhavani Shankar: ప్రియా భవాని శంకర్.. తమిళ తెరపై బిజీగా ఉండే యువ నటీమణులలో ఒకరు. ఆమె ఇప్పుడు ప్రేమలో పడిందంట. ఈ విషయాన్ని ప్రియానే స్వయంగా వెల్లడించారు. సోషల్‌‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియా భవాని, ఇటీవలె లైవ్‌లో నెటిజన్లతో సంభాషించింది. ఈ సందర్భంగా.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తాను ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతానికి తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేసింది.

అయితే, సదరు వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా? కాదా? అసలు ఎవరతను? అనే విషయాలపై చర్చ జరుగుతుంది. ప్రియా మాత్రం అతను ఎవరూ? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తరువాత, ప్రియా భవానీ శంకర్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించి, తర్వాతికాలంలో తమిళ న్యూస్ ఛానెల్‌లో న్యూస్‌రీడర్‌గా అడుగుపెట్టారు. మీడియా రంగంలోకి ప్రవేశించిన తరువాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశారు.

Bhavani

2

ఆ తర్వాత ఐకానిక్ సీరియల్‌లో నటించగా.. ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ వచ్చింది. ఐకానిక్ స్క్రీన్‌పై సంపాదించిన ఆదరణతో వెండితెరపై అడుగు పెట్టిన ప్రియా.. 2017లో మాయ డీర్ చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. మేయాధ మాన్‌, కడైకుట్టి వంటి చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ ప్రస్తుతం కమల్‌హాసన్‌ చేస్తోన్న ఇండియన్‌-2 చిత్రంలో నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar)