Priya Prakash Varrier : కన్ను కొట్టిన సినిమా తర్వాత.. కరెక్ట్‌గా గైడ్ చేసేవాళ్ళు లేక సరైన సినిమాలు చేయలేదు.. ‘బ్రో’లో పవన్ కళ్యాణ్ గారితో..

బ్రో సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టగా తాజాగా ప్రియా వారియర్ విలేఖరుల సమావేశంలో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో ప్రియా వారియర్ తన గురించి, బ్రో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

Priya Prakash Varrier : కన్ను కొట్టిన సినిమా తర్వాత.. కరెక్ట్‌గా గైడ్ చేసేవాళ్ళు లేక సరైన సినిమాలు చేయలేదు.. ‘బ్రో’లో పవన్ కళ్యాణ్ గారితో..

Priya Prakash Varrier comments on Bro movie and her movies

Updated On : July 19, 2023 / 7:47 AM IST

Priya Prakash Varrier :  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టగా తాజాగా ప్రియా వారియర్ విలేఖరుల సమావేశంలో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో ప్రియా వారియర్ తన గురించి, బ్రో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతా.. నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. కన్ను కొట్టిన వీడియో బాగా వైరల్ అయిన తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. దానివల్ల కొన్ని సరైన సినిమాలు చేయలేదనిపించింది. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే ప్రయత్నిస్తున్నాను అని తెలిపింది.

BiggBoss 7 : బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ..

ఇక బ్రో సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు మరీ ఎక్కువ సన్నివేశాలు లేవు. ఆయన చాలా కామ్ గా ఉంటారు. కానీ ఆయన సెట్స్ లో అడుగుపెడితే మాత్రం అందరిలో ఉత్సాహం వస్తుంది. ఆయన ఆ స్థాయికి చేరుకున్నా కానీ చాలా జెంటిల్ గా ఉంటారు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్ లాంటి క్యారెక్టర్. నాకు పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు ఇద్దరితోనూ సన్నివేశాలు ఉంటాయి. ఇదొక కుటుంబ కథ చిత్రం లాంటిది అని తెలిపింది.