Ugravatharam Trailer : ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర లేడీ ఓరియెంటెడ్ సినిమా.. ‘ఉగ్రావతారం’ ట్రైలర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేసారు.

Ugravatharam Trailer : ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర లేడీ ఓరియెంటెడ్ సినిమా.. ‘ఉగ్రావతారం’ ట్రైలర్ రిలీజ్..

Priyanka Upendra Ugravatharam Movie Trailer Released

Updated On : October 16, 2024 / 6:56 AM IST

Ugravatharam Trailer : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఉపేంద్ర లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఉగ్రావతారం’తో రాబోతున్నారు. ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో SG సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉగ్రావతారం’. ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించగా సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Love Reddy : ‘లవ్ రెడ్డి’ ట్రైలర్ చూశారా..? టైటిల్, ట్రైలర్ భలే ఉన్నాయే..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి గెస్టులుగా వచ్చారు. ఆడవాళ్ళ మీద జరిగే ఘోరాలకు ఒక లేడీ పోలీసాఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంది అనే కథాంశంతో యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా నవంబర్ 1న రిలీజ్ కానుంది. ఉగ్రావతారం ట్రైలర్ మీరు కూడా చూసేయండి..

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఉగ్రావతారం లాంటి సినిమా దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.

ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. నాకు హైద్రాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ సినిమా. గురుమూర్తి గారి వల్లే ఈ సినిమాని చేశాను. నవంబర్ 1న మా సినిమా రాబోతోంది. నా మొదటి పాన్ ఇండియా సినిమా ఇది అని అన్నారు. దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాలపై, అటువంటి సమస్యలపై తీశాను. ఇది మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు అని తెలిపారు.

Priyanka Upendra Ugravatharam Movie Trailer Released