Thandel : దారుణం.. APSRTC బ‌స్‌లో తండేల్ సినిమా.. ఇంత అవమానిస్తారా..? బన్నీవాసు ఫుల్ సీరియస్

ఏపీఎస్ ఆర్టీసీ బస్‌లో తండేల్‌ చిత్రాన్ని ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు స్పందించారు.

Producer Bunny vas reacts on Thandel piracy

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన చిత్రం తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. అయితే.. ఈ చిత్రాన్ని పైర‌సీ స‌మ‌స్య వేదిస్తోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన బ‌స్‌లో ఈ మూవీని ప్ర‌ద‌ర్శించ‌డం పై చిత్ర నిర్మాత బ‌న్నీ వాసు స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సంస్థ ఛైర్మ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

తండేల్ చిత్ర పైరేటెడ్ వెర్ష‌న్‌ను ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బ‌స్‌లో ప్ర‌ద‌ర్శించార‌ని ఓ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన వార్త ద్వారా తెలుసుకున్నాం., ఇది చ‌ట్ట విరుద్దం. అన్యాయం మాత్ర‌మే కాదు.. ఈ చిత్రానికి జీవం పోయ‌డానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న ఎంతో మంది వ్య‌క్తులకు ఘోర అవ‌మానం. సినిమా అనేది ఎంతో మంది ఆర్టిస్టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల క‌ల అని బ‌న్నీవాసు పేర్కొన్నారు.

Thandel Collections : బాక్సాఫీస్ వద్ద‌ నాగ‌చైత‌న్య ‘తండేల్’ జోరు.. మూడు రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

ఇలాంటివి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావును బ‌న్నీవాసు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Chiranjeevi : నాటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేనగా రూపాంతరం చెందింది- చిరంజీవి హాట్ కామెంట్స్

సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక న‌టించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. ల‌వ్‌, యాక్ష‌న్‌, దేశ‌భ‌క్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుద‌లైన మూడు రోజుల్లోనే రూ.62.37 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే.. ఈ చిత్రాన్ని కొంద‌రు పైర‌సీ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.

ఇటీవ‌ల ఓ లోక‌ల్ ఛాన‌ల్‌లోనూ ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించింది. దీనిపై ఇటీవ‌ల ఓ మీడియా స‌మావేవంలొఓ బ‌న్నీవాస్ స్పందించారు. మా గీత గోవిందం చిత్రాన్ని పైర‌సీ చేసిన వారిపై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. వారిలో ఇప్పుడిప్పుడే కొంద‌రు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. గీతా ఆర్ట్స్ సినిమాల‌ను పైర‌సీ చేసిన వారిపై, వాటిని డౌన్‌లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిక‌గా వ‌దిలివేస్తామ‌ని అనుకోవ‌ద్ద‌న్నారు.