Allu Arjun Remuneration : బన్నీ 300 కోట్ల రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. పుష్ప కోసం.. ఈయన చెప్పిన లెక్క వింటే..
పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు నిజమేనా అని అడిగితే బన్నీ వాసు సమాధానమిస్తూ..

Producer Bunny Vasu Gives Clarity on Allu Arjun Remuneration for Pushpa 2 movie
Allu Arjun Remuneration : అల్లు అర్జున్ గత సంవత్సరం డిసెంబర్ లో పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఆల్మోస్ట్ 1900 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆల్మోస్ట్ 50 రోజులు పైగా థియేటర్స్ లో ఆడింది. నార్త్ లో అయితే ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇంకో 23 నిముషాలు జతచేసి రీ లోడెడ్ వర్షన్ అంటూ రిలీజ్ చేసారు. దీంతో ఓటీటీలో కూడా పలు దేశాల్లో ట్రెండింగ్ లో ఉంటూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.
అయితే పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది రెమ్యునరేషన్ రూపంలో కాకుండా బిజినెస్, ప్రాఫిట్స్ రూపంలో తీసుకున్నాడు అల్లు అర్జున్ అని సమాచారం. పుష్ప 2 సినిమాకు 300 కోట్లు తీసుకున్నాడు ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అంటూ నేషనల్ మీడియాలో సైతం వైరల్ అయింది. సుకుమార్ కూడా బిజినెస్, ప్రాఫిట్స్ రూపంలో ఈ సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.
Also Read : Allu Arjun : స్పోక్స్ పర్సన్ ని పెట్టుకుంటున్న అల్లు అర్జున్..
అయితే బన్నీ ఫ్యాన్స్ ఈ రెమ్యునరేషన్ ని గొప్పగా చెప్పుకున్నా కొంత మంది మాత్రం మరీ అంతెందుకు తీసుకుంటారు అని కామెంట్స్ చేసారు. అయితే తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. బన్నీ వాసు నిర్మాణంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడాడు.
ఇంటర్వ్యూలో హోస్ట్ పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు నిజమేనా అని అడిగితే బన్నీ వాసు సమాధానమిస్తూ.. వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నా 30 నుంచి 40 శాతం ట్యాక్స్ పే చేయాలి. ఆల్మోస్ట్ 39 శాతం ట్యాక్స్ లు ఉంటాయి వాళ్లకు. అంటే 100 కోట్లకు వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేది 60 కోట్లు మాత్రమే. అందరు పుష్ప సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటున్నారు కానీ అది నాలుగేళ్లకు అని గుర్తించట్లేదు. పుష్ప, పుష్ప 2 సినిమాలకు అల్లు అర్జున్ 5 ఏళ్ళు కేటాయించారు. వేరే ఏ సినిమాలు చేయలేదు. ఒక వేళ తీసుకుంటే ఐదేళ్లు డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎంతొస్తుంది. దానికంటే బయట చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు. అందరూ ఒక సినిమాకి అని చూస్తారు కానీ ఆ సినిమాకు మూడేళ్ళ కష్టం అని చూడరు. సుకుమార్ గారు కూడా రంగస్థలం తర్వాత మళ్ళీ పుష్పనే. ఐదేళ్లు వేరే ఏ సినిమాలు చేయలేదు. ఆయనకు వేరే బిజినెస్ లు లేవు. సినిమా ఎన్ని ఏళ్ళు అయితే అన్ని ఏళ్లకు కలిపి రెమ్యునరేషన్ ఇది అని అన్నారు.
Also Read : Sairam Shankar : వామ్మో.. 25 కుక్కలతో క్లైమాక్స్.. హీరో జస్ట్ మిస్.. కుక్క నుంచి ఎస్కేప్..
దీంతో ఇండైరెక్ట్ గానే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు, కానీ ట్యాక్స్ లో చాలా పోయింది, మూడేళ్లకు కలిపి అది అని క్లారిటీ ఇచ్చేసాడు బన్నీ వాసు. సుకుమార్ గురించి కూడా ఇండైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేసాడు. దీంతో పుష్ప 2 సినిమాకు బన్నీ, సుకుమార్ లు తీసుకున్న రెమ్యునరేషన్స్ నిజమే అని అంతా భావిస్తున్నారు.