Sairam Shankar : వామ్మో.. 25 కుక్కలతో క్లైమాక్స్.. హీరో జస్ట్ మిస్.. కుక్క నుంచి ఎస్కేప్..
సాయి రామ్ శంకర్ ఇప్పుడు 'ఒక పథకం ప్రకారం' అనే సినిమాతో రాబోతున్నాడు.

Sai Ram Shankar says Interesting Facts about Oka Padhakam Prakaram Movie
Sairam Shankar : పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి తన సినిమాలతో పలు హిట్స్ సాధించాడు సాయి రామ్ శంకర్. కానీ తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సాయి రామ్ శంకర్ ఇటీవల మళ్ళీ బిజీ అయ్యాడు. కొన్ని నెలల క్రితం వెయ్ దరువేయ్ సినిమాతో పలకరించిన సాయి రామ్ శంకర్ ఇప్పుడు ‘ఒక పథకం ప్రకారం’ అనే సినిమాతో రాబోతున్నాడు. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కిన ఒక పథకం ప్రకారం సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు సాయిరాం శంకర్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఒక పథకం ప్రకారం అంటే ఆల్మోస్ట్ 80 శాతం క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమా కూడా అదే జానర్. సినిమాలో ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది అందుకే ఒక పథకం ప్రకారం అనే టైటిల్ తీసుకున్నాం. ఈ సినిమాలో నేను క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ లో రకరకాల షేడ్స్ ఉంటాయి. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర కోసం నెల రోజులు వర్క్ షాప్ చేశాను. క్లైమాక్స్ షూటింగ్ కోసం 25 డాగ్స్ తెచ్చాము. ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ 4 రోజులు షూట్ చేసాము. ఓ సమయంలో డాగ్ పైకి రావడంతో అక్కడున్న గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. లేకపోతే ఆ డాగ్ నన్ను గట్టిగానే కొరికేది. అసలే అవి మాములు డాగ్స్ కావు. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. ముందు ఒక క్లైమాక్స్ సీన్ తీసి అది సరిపోలేదని దాన్ని ఇంకా ఎక్స్టెండెడ్ చేసాము. మొత్తం క్లైమాక్స్ ఎనిమిది రోజులు షూట్ చేసాము అని తెలిపారు.
Also Read : Anil Ravipudi – CM Chandrababu : సీఎం చంద్రబాబునే పడీ పడీ నవ్వించిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఈవెంట్లో..
ఈ సినిమాలో ఇంటర్వెల్ సమయానికి విలన్ ని కనిపెడితే పదివేలు ఇస్తామని ప్రమోషన్స్ చేసారు. దాని గురించి మాట్లాడుతూ.. ఆ ఆఫర్ తో సినిమాకు రెస్పాన్స్ బాగా వస్తుంది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడానికి అది బాగా ఉపయోగపడుతుంది. మొదటి నుంచి ఇదొక్కటే అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్‌లో కొంతమంది పట్టుకుంటే పదివేలు అని చెప్పడంతో ఇదే ఫిక్స్ అయ్యాము. మూవీ 50 సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ 50 సెంటర్స్ లో ఈ ఆఫర్ ఉంటుంది. అక్కడ ఉండే బాక్స్ లో ఇంటర్వెల్ లో విలన్ ఎవరు అనేది ఒక పేపర్ పై రాసి వేస్తే కరెక్ట్ సమాధానం చెప్పిన వారికి పదివేలు ఇస్తాము అని తెలిపారు సాయి రామ్ శంకర్.
మలయాళంలో పలు సినిమాలు చేసి హిట్స్ కొట్టి, అవార్డులు అందుకున్న దర్శకుడు వినోద్ విజయన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. డైరెక్టర్ గురించి సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. 17 ఏళ్లకే ఆయన డైరెక్టర్ అయ్యారు. నా ఫస్ట్ మూవీ తర్వాత నుంచి నాకు మంచి ఫ్రెండ్. 2005 నుంచే మెం ఒక సినిమా చేద్దాం అనుకున్నాం ఇప్పటికి కుదిరింది. అన్నిటి మీద అవగాహన ఉన్న మంచి టెక్నీషియన్. దర్శకనిర్మాతగా ఫాహద్ ఫాజిల్ తో రెండు సినిమాలు చేసారు. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ వినీత్ కూడా సినిమా చేద్దాం తెలుగులో అనుకున్నప్పుడు ఈ సినిమా మొదలైంది అని చెప్పారు.
Also Read : Sundeep Kishan : సందీప్ కిషన్ కొత్త సిరీస్ గ్లింప్స్ చూశారా.. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా.. బ్రహ్మానందంతో..
సాయి రామ్ శంకర్ ఒక పథకం ప్రకారం సినిమా తర్వాత ఓ మైథలాజికల్ సినిమా చేస్తున్నట్టు, అందులో 60 ఏళ్ల పాత్ర చేస్తున్నట్టు, అలాగే రీసౌండ్ అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నట్టు, మరికొన్ని సినిమాలు డిస్కషన్స్ జరుగుతున్నట్టు తెలిపారు.