Sundeep Kishan : సందీప్ కిషన్ కొత్త సిరీస్ గ్లింప్స్ చూశారా.. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా.. బ్రహ్మానందంతో..
తాజాగా నెట్ ఫ్లిక్స్ పలు కొత్త సిరీస్ లు, సినిమాలు అనౌన్స్ చేసింది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేయబోతున్న సిరీస్ కూడా ఉంది.

Sundeep Kishan Announced Super Subbu Web Series with Netflix Glimpse Released
Sundeep Kishan : ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం ఓటీటీలలో సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో సందీప్ కిషన్ కూడా వెబ్ సిరిస్ తో రాబోతున్నాడు. తాజాగా నెట్ ఫ్లిక్స్ పలు కొత్త సిరీస్ లు, సినిమాలు అనౌన్స్ చేసింది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా చేయబోతున్న సిరీస్ కూడా ఉంది. సూపర్ సుబ్బు అనే టైటిల్ తో సందీప్ కిషన్ ఓ వెబ్ సిరిస్ చేయబోతున్నాడు.
Also Read : Game Changer : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడు? ఏ ఓటీటీ?
నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. గ్లింప్స్ చూస్తుంటే.. ఇందులో సుబ్బు(సందీప్ కిషన్)కి జాబ్ అవసరమైతే సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా చేయాల్సి వస్తుంది. అది కూడా ఓ ఊరి ప్రజలకు నేర్పించడానికి. ఎక్కువగా పిల్లలు కనే ఆ ఊర్లో సుబ్బు సెక్స్ ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో సస్పెన్స్ కామెడీగా ఈ సూపర్ సుబ్బు అనే సిరీస్ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. సూపర్ సుబ్బు గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..
ఇక ఈ సిరీస్ లో సందీప్ కిషన్ తో పాటు సంపూర్ణేష్ బాబు, బ్రహ్మానందం, మురళి శర్మ, హైపర్ ఆది, మానస చౌదరి, మిథిలా పాల్కర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ రానుంది. ఇటీవలే ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్ కొట్టిన సందీప్ కిషన్ త్వరలో మజాకా సినిమాతో రాబోతున్నాడు. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ సూపర్ సుబ్బు సిరీస్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Also Read : Sai Pallavi : గ్లామర్ కి దూరంగా ఉన్నా.. సాయి పల్లవి క్రేజ్ వేరు.. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు..
దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కీర్తి సురేష్ తో అక్క అనే యాక్షన్ సిరీస్, సైఫ్ అలీఖాన్ జువెల్ థీఫ్, వెంకటేష్ రానా నాయుడు సీజన్ 2, టోస్టర్, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, ఆప్ జైసా కోయి, కోహ్రా సీజన్ 2, మండల మర్డర్స్, గ్లోరీ, ఖాకీ ది బెంగాల్ చాప్టర్, ది రాయల్స్, నయనతార టెస్ట్, సారె జహాసే అచ్చా, ఆర్యన్ ఖాన్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, డైనింగ్ విత్ కపూర్స్, ది గ్రేట్ ఇండియన్ కపుల్ షో సీజన్ 3 .. సినిమాలు, సిరీస్ లు అనౌన్స్ చేసింది.