Sai Pallavi : గ్లామర్ కి దూరంగా ఉన్నా.. సాయి పల్లవి క్రేజ్ వేరు.. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు..

గ్లామరస్ హీరోయిన్లు ఎంతమందున్నా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సాయిపల్లవికే పడిపోయారు జనాలు.

Sai Pallavi : గ్లామర్ కి దూరంగా ఉన్నా.. సాయి పల్లవి క్రేజ్ వేరు.. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు..

Sai Pallavi dont Need Glamours Characters for Career

Updated On : February 4, 2025 / 10:06 AM IST

Sai Pallavi : సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. స్టార్టింగ్ లో లేకపోయినా క్రేజ్ వచ్చిన తర్వాత మారిపోతారు హీరోయిన్లు. కానీ కావల్సినంత క్రేజ్ వచ్చినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటూ కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది సాయిపల్లవి. ఈ కమిట్మెంట్ తో పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మిస్ అయినా సరే ఏం పర్లేదంటోంది సాయిపల్లవి. అసలు జనాలు ఇంప్రెస్ అయ్యింది సాయిపల్లవి యాక్టింగ్ కా? యాటిట్యూడ్ కా?

గ్లామరస్ హీరోయిన్లు ఎంతమందున్నా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సాయిపల్లవికే పడిపోయారు జనాలు. ఎంత పెద్ద హీరో అయినా స్టోరీ బావుంటేనే ఓకే చెప్పే సాయిపల్లవికే ఫిదా అయిపోయారు అభిమానులు. సాయిపల్లవి గ్లామర్ క్యారెక్టర్స్ చెయ్యకపోయినా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. అందుకే సాయిపల్లవి సినిమాలో ఉందంటే హీరో ఎవరన్నది కూడా పెద్ద పట్టించుకోరు ఆడియన్స్. అంతలా సినిమాని ఓవర్ టేక్ చేసేస్తుంది సాయిపల్లవి.

Also Read : Tollywood : ‘సంక్రాంతికి వస్తున్నాం’ దెబ్బకు మారుతున్న టాలీవుడ్ ఆలోచనలు.. చిన్న సినిమాలే వరుసగా హిట్స్..

సాయిపల్లవి ఇంతవరకూ తనకు నచ్చని క్యారెక్టర్ చెయ్యలేదు. ఎంత పెద్ద హీరో అయినా సరే గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పలేదు. అలా మిస్ అయిందే అర్జున్ రెడ్డి సనిమాలో హీరోయిన్ క్యారెక్టర్. నిజానికి ఈ సినిమాలో సందీప్ రెడ్డి సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సాయిపల్లవి కండిషన్స్ తెలుసుకుని మానుకున్నానని ఇటీవల తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు సందీప్ రెడ్డి.

సాయిపల్లవి అంత సింపుల్ గాఉంటుంది కాబట్టే అన్ని రకాల ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సింప్లిసిటీతో పాటు జనాల్ని కట్టిపడేసే యాక్టింగ్ తో, డ్యాన్స్ తో అందర్నీ ఇంప్రెస్ చేసేసింది సాయిపల్లవి. ఫస్ట్ గ్లామర్ రోల్స్ చెయ్యకపోయినా ఇంత స్టార్ డమ్, ఇమేజ్ వచ్చిన తర్వాత జనరల్ గా హీరోయిన్లు మారతారు. చాలా మంది హీరోయిన్స్ మొదట్లో గ్లామర్ కి నో చెప్పి తర్వాత లిప్ కిస్ లు కూడా ఇచ్చారు. కానీ సాయిపల్లవి ఏ మాత్రం మారలేదు. తన సింప్లిసిటీతోనే బాలీవుడ్ ని కూడా మెప్పించింది.

Also Read : Thandel : 30 రోజులు రియల్ సముద్రంలో షూట్.. పాకిస్తాన్ జైలు సెట్.. తండేల్ గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

అందుకే బాలీవుడ్ లో ఆల్రెడీ అంతమంది హీరోయిన్లున్నా అక్కడ తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణం కోసం సీతగా సాయిపల్లవినే సెలక్ట్ చేసుకున్నారు. అసలు సాయిపల్లవి సినిమాలో ఉందంటే జనాల కాన్సన్ట్రేషన్ అంతా సాయిపల్లవి మీదకే వెళ్లిపోతుంది. అలా తండేల్ లో కూడా నాగచైతన్య కంటే సాయిపల్లవి నే హైలైట్ చేసి చూస్తున్నారు చాలా మంది ఆడియన్స్. మరి తండేల్ సినిమాకి సాయిపల్లవి మ్యాజిక్ ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో చూడాలి.