Tollywood : ‘సంక్రాంతికి వస్తున్నాం’ దెబ్బకు మారుతున్న టాలీవుడ్ ఆలోచనలు.. చిన్న సినిమాలే వరుసగా హిట్స్..

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్‌ నుంచి రిలీజ్‌ అవుతున్న ప్రతీ పది సినిమాల్లో ఏడెనిమిది పాన్ ఇండియా మూవీస్‌ పేరుతోనే వస్తున్నాయి.

Tollywood : ‘సంక్రాంతికి వస్తున్నాం’ దెబ్బకు మారుతున్న టాలీవుడ్ ఆలోచనలు.. చిన్న సినిమాలే వరుసగా హిట్స్..

Tollywood Producers wants to Plan Small and Medium Budget Movies rather than High Budget Movies

Updated On : February 4, 2025 / 9:50 AM IST

Tollywood : సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ మీదే డిపెండ్‌ అయి ఉంటుంది. కానీ భారీ బడ్జెట్‌ పెట్టి మూవీ తీస్తే తీరా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిందనుకో ఇక కష్టమే. పాన్‌ ఇండియా మూవీస్ విషయంలో పలువురు మేకర్స్‌కు ఈ మధ్య ఇదే ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుంది. దాంతో పెద్ద సినిమాల ప్రస్తావన వస్తే వద్దు బాబోయ్‌ అంటున్నారట పలువురు నిర్మాతలు. ఇక నుంచి మీడియం రేంజ్‌ బడ్జెట్‌తో మూవీస్‌కు ప్లాన్ చేస్తున్నారట.

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్‌ నుంచి రిలీజ్‌ అవుతున్న ప్రతీ పది సినిమాల్లో ఏడెనిమిది పాన్ ఇండియా మూవీస్‌ పేరుతోనే వస్తున్నాయి. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో సినిమాలు తీస్తున్నారు. తీరా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి కనీసం ఒక ప్రమోషన్ కూడా లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్. కొంత మంది నిర్మాతలు అయితే ముందు తెలుగులో రిలీజ్ చేసి తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తున్నారు. పేరుకు పాన్ ఇండియా మూవీ అంటూ టిక్కెట్ల రేట్లు పెంచుకున్నప్పటికీ ఆఖరికి తెలుగులో అనుకున్నంత సక్సెస్ సాధించక ఇబ్బంది పడుతున్నారు.

Also Read : Thandel : 30 రోజులు రియల్ సముద్రంలో షూట్.. పాకిస్తాన్ జైలు సెట్.. తండేల్ గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటమే కాదు పబ్లిక్‌గా తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో అలర్ట్ అవుతున్నారట మేకర్స్. ఇక నుంచి పాన్ ఇండియా సినిమాల జోళికి వెళ్లొద్దని అనుకుంటున్నారట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కొన్నాళ్ల పాటు పాన్ ఇండియా సబ్జెక్స్ట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నారట.

చిన్న, మీడియం రేంజ్‌ సినిమాలంటే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీని ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. 50 కోట్లతో తీసిన సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ సినిమాగా వచ్చి వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటివరకు 303 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి భారీ ప్రాఫిట్స్ సాధించింది. అంతే కాక గత రెండేళ్లలో చిన్న సినిమాలే భారీ విజయాలు సాధించి ప్రాఫిట్స్ దక్కించుకున్నాయి.

Also Read : Mohan Babu : నా ఆస్తిపై ఎవరికీ అధికారం లేదు.. మనోజ్ తిరిగివ్వాల్సిందే.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు…

200 కోట్లు పెట్టి 210 కోట్లు తెచ్చుకోవడం కంటే ఓ 20 కోట్లు పెట్టి 50 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకోవడం బెటర్ అంటున్నారు. గత సంవత్సరం క సినిమా 10 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు వచ్చింది. కమిటీ కుర్రాళ్ళు 5 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్లు వచ్చింది. గామి సినిమా 6 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు వచ్చింది. ఆయ్ సినిమా 5 కోట్లు పెట్టి తీస్తే 15 కోట్లు వచ్చింది.. ఇలా చిన్న సినిమాలే ఎక్కువ ప్రాఫిట్స్ రాబడుతున్నాయి. దీంతో ఇలా తక్కవ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించటమే బెటరని భావిస్తున్నారట నిర్మాతలు. ఈ మార్పు ఎంత వరకు టాలీవుడ్ సక్సెస్‌కు బాటలు వేస్తుందో చూడాలి మరి.