Game Changer : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

ఇన్నాళ్లు థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Game Changer : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

Ram Charan Shankar Game Changer Movie OTT Streaming Details

Updated On : February 4, 2025 / 12:34 PM IST

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ హీరోగా అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా SJ సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సముద్రఖని.. ఇలా పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న థియేటర్స్ లో రిలీజయింది.

Also Read : Sai Pallavi : గ్లామర్ కి దూరంగా ఉన్నా.. సాయి పల్లవి క్రేజ్ వేరు.. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు..

ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రజలకు ఎంత మేలు చేయగలడు అనే అంశంతో కమర్షియల్ గా తెరకెక్కించారు ఈ సినిమాని. ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. ఈ సినిమా థియేటర్స్ లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ కే 75 కోట్లు పెట్టి భారీగా శంకర్ తన స్టైల్ లో షూట్ చేసారు. ఇన్నాళ్లు థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Also Read : Tollywood : ‘సంక్రాంతికి వస్తున్నాం’ దెబ్బకు మారుతున్న టాలీవుడ్ ఆలోచనలు.. చిన్న సినిమాలే వరుసగా హిట్స్..

గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. హిందీలో తర్వాత రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఓటీటీలో చూసేయొచ్చు.