Allu Arjun : స్పోక్స్ పర్సన్ ని పెట్టుకుంటున్న అల్లు అర్జున్..
పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో 2 వేల కోట్లు కలెక్షన్ క్లబ్‌లోకి చేరిన అల్లుఅర్జున్.. ముందు ముందు చేసే సినిమాల మార్కెట్ ఇంకా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నాడట.

టాలీవుడ్ స్టార్ హీరోలు సరికొత్త డెసిషన్స్‌తో టాక్ ఆఫ్‌ది మీడియాగా నిలుస్తున్నారు. వరుస విజయాలతో ఊపుమీదున్న స్టార్లు..తమ ఫ్యాన్ బేస్‌ను, సక్సెస్ రేటును మరింత పెంచుకునేందుకు అన్నీ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో 2 వేల కోట్లు కలెక్షన్ క్లబ్‌లోకి చేరిన అల్లుఅర్జున్.. ముందు ముందు చేసే సినిమాల మార్కెట్ ఇంకా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నాడట. వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యే ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాసెస్‌లో తన పనులన్నీ చక్కబెట్టేందుకు స్పెషల్ స్పోక్ పర్సన్‌ను పెట్టుకుంటున్నాడట బన్నీ.
ఇప్పటి వరకు పొలిటీషియన్స్‌కు, ఇతర బిజినెస్ మ్యాన్స్ దగ్గర స్పోక్ పర్సన్స్‌ను చూశాం. కానీ ఫస్ట్ టైమ్ ఓ హీరోకి స్పోక్స్ పర్సన్ ఉండటం చూడబోతున్నామట. ఇక ముందు అల్లుఅర్జున్ ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో.. ప్రతీది బన్నీ తరుపున ఆ స్పోక్ పర్సనే చూసుకుంటాడట.
Sairam Shankar : వామ్మో.. 25 కుక్కలతో క్లైమాక్స్.. హీరో జస్ట్ మిస్.. కుక్క నుంచి ఎస్కేప్..
అల్లుఅర్జున్ ఎవరైనా కలవాలన్నా.. ఏదైనా చెప్పాలనుకున్న స్పోక్ పర్సన్ ద్వారానే జరుగుతుందట. త్వరలో త్రివిక్రమ్‌తో మూవీ చేయబోతున్నాడు అల్లుఅర్జున్. తర్వాత పుష్ప-3 చేసే అవకాశం ఉంది. లేకపోతే అట్లీ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కే చాన్సుంది.
ఇలా తర్వాత వచ్చే అల్లుఅర్జున్ సినిమాలు, ఆయన ఈవెంట్స్, పలు విషయాలపై ఆయన వెర్సన్ ఏంటో స్పోక్స్ పర్సన్ చూసుకోనున్నాడట. మరి ఇది నిజమా లేక జస్ట్ గాసిపా అనేది అల్లు కంపౌండ్ క్లారిటీ ఇస్తే తప్ప స్పష్టత వచ్చేలా లేదు.