Producer Ch Rama Rao : అసలు కథ పార్ట్ 2 లోనే ఉంది.. విడుదల 2 తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత కామెంట్స్..

విడుదల 2 డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

Producer Ch Rama Rao : అసలు కథ పార్ట్ 2 లోనే ఉంది.. విడుదల 2 తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత కామెంట్స్..

Producer Chintapalli Rama Rao Comments on Vijay Sethupathi Vidudala 2 Movie

Updated On : December 18, 2024 / 6:52 PM IST

Producer Ch Rama Rao : విజయ్ సేతుపతి, సూరి మెయిన్ లీడ్స్ లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదల సినిమా తమిళ్, తెలుగులో మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ విడుదల పార్ట్ 2 రానుంది. విడుదల 2 డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇటీవలే విజయ్ సేతుపతి, మంజు వారియర్ హైదరాబాద్ కి వచ్చి తెలుగులో ప్రమోషన్స్ కూడా చేసారు. తాజాగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత చింతపల్లి రామారావు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు విడుదల 2 సినిమా గురించి మాట్లాడుతూ.. పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ కథే ‘విడుదల-2’. ఇలాంటి కథలు మన నేటివిటికి కూడా సరిపోతాయి. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశారు. ఓ విప్లవ కెరటం తన వర్గ ప్రజలను పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అని ఆసక్తికరంగా తెరకెక్కించారు. పార్ట్‌ వన్‌ లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్‌ చేశారు. అసలు కథ అంతా విడుదల 2 లోనే ఉంది. పార్ట్‌ వన్‌కు పది రెట్లు ఈ సినిమా ఉంటుంది. పార్ట్ 1లో విజయ్ సేతుపతి కాసేపే కనిపిస్తాడు. కానీ ఇందులో ప్రతి ఫ్రేమ్‌లో విజయ్‌ సేతుపతి ఉంటాడు అని తెలిపారు.

Also Read : Raghav Omkar Sasidhar : సినిమా రిలీజ్ కి ముందే అవార్డులు సాధిస్తున్న కృష్ణవంశీ శిష్యుడు.. మొగలిరేకులు సాగర్ హీరోగా..

ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర గురించి మాట్లాడుతూ.. నటుడిగా అయితే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో పెరుమాళ్‌కు పాత్రకు ఆయన పర్ఫెక్ట్ గా సరిపోయాడు. నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, ఎమోషన్ అద్భుతంగా పండించాడు. ప్రజా సంక్షేమం కోసం ఓ వ్యక్తి తమ వాళ్లను, తన కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు అంటూ ఎమోషనల్‌గా నటించాడు అని తెలిపారు.

విడుదల 2 సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి కారణాలు తెలుపుతూ.. విడుదల 1 మంచి హిట్ అయింది. ఆ సినిమా చూసాను. అది నచ్చడంతో విడుదల 2 తీసుకోవాలనుకున్నాను. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా మంది పోటీపడ్డారు. కానీ వెట్రిమారన్ కు తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలియడంతో నేను ట్రై చేసి దక్కించుకున్నాను. అలాగే కమర్షియల్ గా విజయ్ సేతుపతి మహారాజ సినిమా పెద్ద హిట్ అవ్వడం కూడా ఒక కారణం. అలాగే సీక్వెల్స్ ఇటీవల హిట్ అవుతున్నాయి. ఆ సెంటిమెంట్ తో కూడా విడుదల 2 తీసుకున్నాను. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ లో 600 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.

ఈ సినిమాలోని మరిన్ని విషయాల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇళయరాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది. ఈ సినిమాలో ఆయన ఇళయరాజాలా కాదు ప్రళయరాజాలా అనిపిస్తాడు. అలాగే ఈ సినిమాకు పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమాల్లో చూడని ఫైట్స్ సెట్ చేయించాడు. మంజు వారియర్‌ ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ బాగా పండాయి అని తెలిపారు.

https://www.youtube.com/watch?v=lglojaQlUVU

విడుదల పార్ట్‌ 3 గురించి మాట్లాడుతూ అది దర్శకుడి చేతిలోనే ఉంటుంది అని తెలిపారు. అలాగే తమ సంస్థలో నెక్స్ట్ రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నె నటించిన శ్రీ శ్రీ రాజావారు సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. త్వరలోనే డ్రీమ్‌గర్ల్‌ అనే ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాం. మరో రెండు పెద్ద సినిమాలు మొదలు కానున్నాయి కానున్నాయి అని తెలిపారు నిర్మాత చింతపల్లి రామారావు.