Raghav Omkar Sasidhar : సినిమా రిలీజ్ కి ముందే అవార్డులు సాధిస్తున్న కృష్ణవంశీ శిష్యుడు.. మొగలిరేకులు సాగర్ హీరోగా..
ది 100 సినిమా రిలీజ్ కి ముందే పలు నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అనేక అవార్డులను గెలుచుకుంది.

RK Sagar The 100 Movie Getting Awards Director Raghav Omkar Sasidhar Thanks post to his Guru Krishna Vamsi
Raghav Omkar Sasidhar : పలు ఇండిపెండెంట్ సినిమాలతో అవార్డులు గెలుచుకున్న దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ‘ది 100’ అనే సినిమా రానుంది. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ ఇందులో విక్రాంత్ అనే ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు.
అయితే ది 100 సినిమా రిలీజ్ కి ముందే పలు నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో దర్శకుడు ఇదంతా తన గురువుగారి వల్లే అంటూ ఓ స్పెషల్ పోస్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
Also Read : Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?
తన పోస్ట్ లో.. నేను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ది 100’ రిలీజ్ కి ముందే అనేక ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంటుంది. సినిమా చూసిన వాళ్లంతా సినిమా గురించి, ఇందులో క్యారెక్టర్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా కథని రాయడం, పాత్రలను రాసుకోవడం అంతా నా గురువు కృష్ణవంశీ గారి దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న విలువలు, కథ చెప్పే విధానం నా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ సక్సెస్ ని వందశాతం నా గురువు కృష్ణవంశీ గారికి అంకితం ఇస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా మీ అందరి ముందుకు రానుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. నన్ను ఇంత బాగా గైడ్ చేసినందుకు మా గురువు గారు కృష్ణవంశీ గారికి ధన్యవాదాలు అంటూ తెలిపాడు రాఘవ్ ఓంకార్ శశిధర్.
View this post on Instagram