Naga Vamsi : ఆ సినిమా నచ్చలేదు అంటే వాళ్ళతో మీటింగ్ పెట్టాలి.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..
నాగవంశీ ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Producer Naga Vamsi Interesting Comments on Lucky Bhaskar Movie
Naga Vamsi : సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాతగా నాగవంశీ మంచి మంచి సినిమాలనే అందిస్తున్నారు. అయితే ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ లలో అప్పుడప్పుడు సంచలన కామెంట్స్, అడిగిన ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వడంతో బాగా పాపులర్ అయ్యారు. గతంలో సినిమా బాగోలేదని యూట్యూబ్ లో రివ్యూలు చెప్పవాళ్లపై గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.
త్వరలో నిర్మాత నాగవంశీ నుంచి లక్కీ భాస్కర్ సినిమా రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నాగవంశీ ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Kian Abbavaram : ఇండస్ట్రీలో బతకాలంటే రాజకీయం తెలియాలి.. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి..
నాగవంశీ మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ ఓ కొత్త కథతో తెలుగులో రాబోతున్న సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను లక్కీ భాస్కర్ సినిమా మీద. ఈ సినిమా నచ్చని రివ్యూయర్స్, సినిమా నచ్చని వాళ్ళు ఇంకెవరు ఉన్నా వాళ్ళతో మీటింగ్ పెట్టాలని ఉంది. వాళ్లకు నిజంగానే సినిమా నచ్చకపోతే వాళ్ళతో మీటింగ్ పెట్టాలని ఉంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మరి నిజంగానే రిలీజ్ తర్వాత ఎవరైనా సినిమా నచ్చలేదు అంటే వాళ్ళతో నాగవంశీ మీటింగ్ పెట్టి ఎందుకు నచ్చలేదు అని వాదిస్తారా చూడాలి.