Producer Satish : ఎన్టీఆర్ బామ్మర్దితో త్వరలో సినిమా.. నేను, నాని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాం.. సోలో బాయ్ నిర్మాత కామెంట్స్..

సోలో బాయ్ సినిమా గురించి సతీష్ మాట్లాడుతూ..

Producer Satish : ఎన్టీఆర్ బామ్మర్దితో త్వరలో సినిమా.. నేను, నాని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాం.. సోలో బాయ్ నిర్మాత కామెంట్స్..

Producer Satish

Updated On : July 4, 2025 / 12:18 AM IST

Producer Satish : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా సోలో బాయ్. ఈ సినిమా నేడు జులై 4న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

సోలో బాయ్ సినిమా గురించి సతీష్ మాట్లాడుతూ.. గౌతమ్ కృష్ణ నాకు తమ్ముడు లాంటివాడు. తనే ఈ సినిమా లైన్ చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబంలోని 17 సంవత్సరాల నుండి సెటిల్ అవ్వడానికి పడే కష్టం తాలూకా పాయింట్ నాకు బాగా నచ్చింది. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ కు వెళ్లే ముందు సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. బయటకు వచ్చాక కొన్ని సీన్లు మార్పులు చేర్పులు చేసాము. సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను నుంచోవాలి అనుకుని ఆలోచనతో సాగే సినిమా ఇది. ఈ సినిమా రెండు గంటల పది నిమిషాలు నిడివి ఉంది. సెన్సార్ U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో దాదాపు 120 నుండి 150 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

Also Read : Uppu Kappurambu : ‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ.. స్మశానంలో స్థలం కోసం గొడవలు..

అలాగే.. ఈ సినిమాకు డబ్బులు ఇవ్వాల్సిన వారందరికీ, రోజువారీ వర్కర్స్ కి డబ్బులు ఇచ్చేసాను. మెయిన్ టెక్నిషియన్స్, నాకు తెలిసిన వాళ్లకు కొంత ఇచ్చి రిలీజ్ అయ్యాక వచ్చిన లాభాల్లో ఇస్తానని చెప్పాను. అందుకు అంతా ఒప్పుకున్నారు. బడ్జెట్ అనుకున్నదానికంటే 10 లక్షల లోపే ఈ సినిమాని పూర్తి చేసాము. గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాము. అది మాకు ఓటీటీ కాబట్టి వర్కౌట్ అయింది. తర్వాత సినిమా కూడా ఓటీటీకే చేసాము. ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ఉంటున్నాయి. చిన్న సినిమాలకు సింగిల్ స్క్రీన్స్ కష్టమే. కేవలం మల్టిప్లెక్స్ లు దొరుకుతున్నాయి అని అన్నారు.

సతీష్ తన గురించి చెప్తూ.. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి వినాయక్ గారితో పాటు చాలా మంది సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసాను. జాబ్ ఉన్నా డబ్బులు రాకపోవడంతో మధ్యలో సినీ పరిశ్రమ వదిలేసి డబ్బు సంపాదించుకున్న తర్వాత వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంత డబ్బులు సంపాదించి ఇప్పుడు నిర్మాతగా మారాను. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపద నంది, బలగం వేణు.. వీరందరితో కలిసి పనిచేసాను, వాళ్లంతా నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా. నాచురల్ స్టార్ నానితో కూడా కలిసి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇప్పుడు అతను స్టార్ హీరో, నేను ఇలా నిర్మాతగా మారాను. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బామ్మర్దితో థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను అని తెలిపారు.

Also Read : Ye Maya Chesave : ‘ఏ మాయ చేసావే’ సినిమాని రిజెక్ట్ చేసిన చిరంజీవి.. ఆ రోల్ కోసం.. చేసుంటే క్లైమాక్స్ మొత్తం మారిపోయేదిగా..