Site icon 10TV Telugu

Producer SKN : పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే.. టాలీవుడ్ సమ్మెపై నిర్మాత SKN పోస్ట్ వైరల్..

Producer SKN Tweet on Tollywood Strike

Producer SKN

Producer SKN : టాలీవుడ్ సినీ కార్మికులకు ఏకంగా 30 శాతం వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ చేసిన ప్రతిపాదనలను ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్ లో సమ్మె జరుగుతుంది. షూటింగ్స్ కి ఎవరూ వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. 5 శాతం పెంచుతామన్నా ఒప్పుకోలేదు. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం, నిర్మాతలు ఎవరూ ప్రత్యేక ఒప్పందాలు చేసి షూటింగ్ కి వెళ్లొద్దు అంటూ ఒక లేఖ విడుదల చేసింది.

ఇక టాలీవుడ్ సమ్మెపై పలువురు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత SKN తన ట్విట్టర్లో.. ఇప్పటికే ధియేటర్స్ కి ఆడియన్స్ దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటిటి, శాటిలైట్స్ అగమ్య గోచరం, పైరసీ పుండు మీద కారం, పేరుకే వినోద పరిశ్రమ.. నిర్మాతల శ్రమ విషాదమే అంటూ నిర్మాతల బాధలు చెప్తూ ట్వీట్ చేసారు.

Also Read : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ డే షూటింగ్.. పవన్ ని కలవాలని ఫిలిం ఫెడరేషన్ నాయకుల నిరసన.. పోలీస్ బందోబస్త్..

ఒక్క ట్వీట్ లోనే ఇప్పుడు ఉన్న కష్టాలు అన్ని చెప్పుకొచ్చారు. ఓ పక్క థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదు, హిట్ అయిన సినిమాలకు కూడా కలెక్షన్స్ రావట్లేదు, ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ తగ్గింది. మరోవైపు పైరసి విజృంభిస్తుంది. ఇన్నిటిమధ్య ఇప్పుడు కార్మికులకు వేతనాలు ఏకంగా 30 శాతం పెంచాలని లేకపోతే సమ్మె అని షూటింగ్స్ ఆపేయడంతో నిర్మాతలు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. నేడు దీనిపై నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. అది అయ్యాక టాలీవుడ్ సమ్మె, వేతనాలపై నిర్ణయం తెలిసే అవకాశం ఉంది.

Also Read : Kiran abbavaram : కిర‌ణ్ అబ్బ‌వ‌రం కొడుకు పేరు ఏంటో తెలుసా? తిరుమ‌ల‌లో నామ‌క‌ర‌ణం..

Exit mobile version