Producer SKN – Allu Sirish : అల్లు శిరీష్ కి హిట్ ఇస్తా.. అల్లు అర్జున్ తో సినిమా తీస్తా.. నిర్మాత SKN కామెంట్స్..

బేబీ సినిమాతో పెద్ద హిట్ అయ్యాక ప్రస్తుతం నిర్మాతగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.

Producer SKN Allu Sirish

Producer SKN – Allu Sirish : నిర్మాత SKN సినీ పరిశ్రమకు అల్లు శిరీష్ ద్వారానే వచ్చాడని చాలామందికి తెలుసు. మొదట అల్లు అర్జున్ దగ్గర పనిచేసి అనంతరం జర్నలిస్ట్ గా, పీఆర్వోగా మారి అనంతరం నిర్మాతగా సినిమాలు చేస్తూ, సినిమాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తూ వెళ్తున్నాడు. బేబీ సినిమాతో పెద్ద హిట్ అయ్యాక ప్రస్తుతం నిర్మాతగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.

రేపు SKN పుట్టిన రోజు కావడంతో నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో మిమ్మల్ని సినీ పరిశ్రమకు తీసుకొచ్చింది శిరీష్ అన్నారు కదా ఆయనతో ఎప్పుడు సినిమా తీస్తారు? ఆయనకు ఒక మంచి సినిమా ఇవ్వొచ్చు కదా అని అడిగారు.

Also Read : Harihara VeeraMallu : వారణాసి ఫిక్స్..? ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా.. ఎప్పుడో తెలుసా?

దీనికి నిర్మాత SKN సమాధానమిస్తూ.. ఇవాళ నేను సినీ పరిశ్రమలో ఉన్నాను అంటే దానికి మెయిన్ కారణం శిరీష్. శిరీష్ నాకు మంచి ఫ్రెండ్. అతనితో సినిమా అంటే బెస్ట్ ఇవ్వాలి నేను. ప్రస్తుతం శిరీష్ ఒక సినిమా చేస్తున్నాడు. శిరీష్ చేసే సినిమా అయ్యాక నేను అతనితో సినిమా చేస్తాను. అతని కోసం నేను ఒక కథ ఫైనల్ చేశాను. దాని వర్క్ నడుస్తుంది. ఆ సినిమాతో అతనికి మంచి హిట్ ఇస్తాను అని అన్నారు.

అలాగే అల్లు అర్జున్ తో కూడా మీరు క్లోజ్ గా ఉంటారు కదా, ఆయనతో సినిమా చేస్తారా అని అడగ్గా.. అల్లు అర్జున్ నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటి వారు. నాకు ఏం జరిగినా చూసుకోడానికి ఆయన ఉంటాడు అని ధైర్యం. భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను అన్నారు.

Also Read : Producer SKN : రెమ్యునరేషన్స్, టికెట్ రేట్లు తగ్గించకపోతే మొత్తం పోతారు.. నిజాలు మాట్లాడిన నిర్మాత SKN..

అల్లు శిరిష్ ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అయినా చాలా తక్కువ సినిమాలు చేసాడు. ఒకటి రెండు మంచి హిట్స్ తప్ప భారీ హిట్ పడలేదు శిరీష్ కి. దీంతో అల్లు శిరీష్ ఒక మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి నిర్మాత SKN చేసే సినిమాతో శిరీష్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి.