Harihara VeeraMallu : వారణాసి ఫిక్స్..? ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా.. ఎప్పుడో తెలుసా?

హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.

Harihara VeeraMallu : వారణాసి ఫిక్స్..? ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా.. ఎప్పుడో తెలుసా?

Harihara VeeraMallu

Updated On : July 6, 2025 / 3:25 PM IST

Harihara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అనేక వాయిదాల అనంతరం జులై 24న రిలీజ్ అవుతుంది ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఈ సారి మాత్రం వాయిదా ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో పనులు కూడా మొదలుపెట్టారు. కానీ సినిమా వాయిదా పడటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ దగ్గర పడుతుండటంతో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చ జరుగుతుంది.

Also Read : Producer SKN : రెమ్యునరేషన్స్, టికెట్ రేట్లు తగ్గించకపోతే మొత్తం పోతారు.. నిజాలు మాట్లాడిన నిర్మాత SKN..

లాస్ట్ టైం అనుకున్నట్టే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌత్ లో తిరుపతిలో, నార్త్ లో వారణాసి లో పెట్టనున్నట్టు సమాచారం. వారణాసి లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 17న ఉంటుందని, ఆ ఈవెంట్ కి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తుంది. పవన్ సనాతన ధర్మం కోసం పోరాడుతూ, బీజేపీ తో పొత్తులో ఉండటంతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం కోసం నిలబడే యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపిస్తే నేషనల్ వైడ్ ఆ ఈవెంట్ కచ్చితంగా వైరల్ అవుతుంది, చర్చగా మారుతుంది. సినిమాకు కూడా బాగా రీచ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక వారణాసిలో అయ్యాక తిరుపతిలో జులై 19 న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. ఈ ఈవెంట్ కు భారీగా పవన్ ఫ్యాన్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారో చూడాలి.

Also Read : Pawan Kalyan : ఆ స్వాగ్ చూడు తమ్ముడు.. ‘పవన్ కళ్యాణ్’ లేటెస్ట్ ఫొటోలు వైరల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ నుంచి..