Producer SKN : రెమ్యునరేషన్స్, టికెట్ రేట్లు తగ్గించకపోతే మొత్తం పోతారు.. నిజాలు మాట్లాడిన నిర్మాత SKN..
తాజాగా నిర్మాత SKN నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం గురించి మాట్లాడారు.

Producer SKN
Producer SKN : ఇటీవల సినీ పరిశ్రమలో థియేటర్స్ కి జనాలు రావట్లేదని, సినిమా బడ్జెట్స్ పెరిగాయని, పరిశ్రమ నష్టాల్లో ఉందని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. కానీ అదే నిర్మాతలు జనాలు థియేటర్స్ కి రానివ్వకుండా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు, ఓటీటీలలోకి త్వరగా సినిమాలు తెచ్చేస్తున్నారు. తాజాగా నిర్మాత SKN నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం గురించి మాట్లాడారు.
రేపు నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు(SKN) పుట్టినరోజు సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడగా 10 టీవీ ప్రతినిధి ఇటీవల థియేటర్స్ సమస్యలు, జనాలు థియేటర్స్ కి రావట్లేదని నిర్మాతలు అంటున్నారు. మీరు కూడా దానిపై సోషల్ మీడియాలో స్పందించారు. మరి మీ వర్షన్ పెద్ద నిర్మాతలకు వినిపించారా అని అడిగారు.
దీనికి నిర్మాత SKN సమాధానమిస్తే..నేను మాట్లాడాను కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మనం చెప్తే ఎవరూ వినరు. రెమ్యునరేషన్స్ భారీగా పెంచేస్తున్నారు. సినిమా బడ్జెట్లు పెంచేస్తున్నారు. అక్కర్లేకపోయినా పెంచేస్తున్న నటీనటుల రెమ్యునరేషన్స్ తగ్గించాలి. నిర్మాతలు వెళ్లి హీరోలని ఒప్పించాలి. ఇక సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఒకర్ని చూసి ఇంకొకరు పెంచుతున్నారు. ఆడియన్స్ కూడా ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు అవసరమా అని ఇటీవల కొన్ని సినిమాలకు అనుకున్నారు. వీళ్ళే టికెట్ రేట్లు పెంచి ఆడియన్స్ ని సినిమాలకు రాకుండా చేసేస్తున్నారు. తక్కువ టికెట్ రేటు ఉంటే కనీసం సరదాగా అయినా ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు. మీరు సినిమా బడ్జెట్ లు పెంచుకొని థియేటర్ కి జనాలు రావట్లేదు అని వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేద్దాం అనుకుంటే మీకే నష్టం, వాళ్ళు కూడా రావడం మానేస్తారు.
ఇక ఓటీటీలోకి మూడు, నాలుగు వారాల్లో సినిమా వస్తుంటే అంత టికెట్ రేటు పెట్టి థియేటర్ కి ఎందుకు వస్తారు. ఆ డబ్బులు దాచుకోవడం బెటర్ అనుకుంటున్నారు. ఒక పెద్ద సినిమాకు ఎక్కువ టికెట్ రేటు పెట్టి ప్రేక్షకులు వచ్చినా ఇంకో మూడు నాలుగు నెలలు మళ్ళీ థియేటర్ కి రావట్లేదు. దీంతో ఆ తర్వాత వచ్చే చిన్న, మీడియం సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. ఇవే కనక కంటిన్యూ అయితే నాని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు పోతారు మొత్తం పోతారు.. నిర్మాతలు అంతా పోతారు అని అన్నారు. దీంతో నిర్మాత SKN పరిశ్రమ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇకనైనా నిర్మాతలు వీటి మీద దృష్టి పెట్టకపోతే తెలుగు సినీ పరిశ్రమకు ఇంకా గడ్డు కాలం చూడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read : Ravi Kishan : పాలతో స్నానం.. గులాబీ పూల మీద నిద్ర.. దెబ్బకు సినిమా అవకాశాలు పోవడంతో..