The Rajasaab: రాజాసాబ్ క్రేజ్ తగ్గిందా.. ఇచ్చిపడేసిన నిర్మాత.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ సినిమా ది రాజాసాబ్(The Rajasaab). హారర్, కామెడీ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు.

The Rajasaab: రాజాసాబ్ క్రేజ్ తగ్గిందా.. ఇచ్చిపడేసిన నిర్మాత.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..

Producer TG Vishwaprasad gave solid counter to those making negative comments Raja Saab movie.

Updated On : December 22, 2025 / 7:51 AM IST

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ సినిమా ది రాజాసాబ్. హారర్, కామెడీ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 రన్నరప్ గా తనూజ.. విన్నర్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షల్లో తెలిస్తే మతిపోతుంది..

ఈ ఇంటర్వ్యూలో ఆయన ది రాజాసాబ్(The Rajasaab) ఓటీటీ డీల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఈ సినిమాకు తాము అనుకున్నట్టుగా డీల్ జరుగలేదు అని, అంచనాలకు తగ్గి ఓటీటీ డీలింగ్ జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, విశ్వప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ప్రభాస్ క్రేజ్ తగ్గిపోయిందని, అందుకే రాజాసాబ్ కి ఓటీటీ డీల్ లో చాలా తక్కువగా అమ్మారు అంటూ నెగిటీవ్ కామెంట్స్ మొదలుపెట్టారు. దానికి, మరోసారి సోషల్ మీడియాలో స్పందించిన విశ్వప్రసాద్ నెటిజన్స్ కి, నెగిటీవ్ క్రియేట్ చేస్తున్న వారికి సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు.

“మా అతిపెద్ద సినిమా రాజాసాబ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. మేము, మా అంతర్గత ఖర్చుల గురించి, లెక్కల గురించి ఓపెన్ గా మాట్లాడలేము. అయినా, మాకు, మా అభిమానులకు కావాల్సింది థియేటర్లలో సినిమా చూపించే ఇంపాక్ట్. ఆ విషయాన్ని, బాక్సాఫీస్ లెక్కలను సినిమా విడుదలైన తర్వాత షేర్ చేస్తాము. నిజానికి, సినిమా ఇండస్ట్రీ కూడా దశలవారీగా మారుతూ వస్తోంది. ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్ సర్దుబాటుకు లోనవుతోంది. ఇది నిజం. అయినప్పటికీ థియేటర్లు అసలైన తీర్పును ఇస్తూనే ఉన్నాయి. ఇలాంటి సిచువేషన్స్ లో కూడా మా రాజాసాబ్ సినిమా అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించింది. పోలికలు అవసరం లేదు. రాజాసాబ్ మూవీ థియేటర్లలో గర్జించడానికి రూపొందించిన ఒక భారీ హారర్-ఫాంటసీ మూవీ. స్క్రీన్లే మాట్లాడనివ్వండి”అంటూ రాసుకొచ్చాడు. ఈ ఒక్క పోస్ట్ తోరాజాసాబ్ పై నెగిటీవ్ క్రియేట్ చేస్తున్న వారికి ఇచ్చిపడేశాడు నిర్మాత.