Tollywood : సి.కళ్యాణ్‌పై నిర్మాతల మండలి సభ్యుల ఆగ్రహం..
తెలుగు చిత్రసీమలో రోజుకో సమస్య తెరపైకి వస్తుంది. ఒకసారి టిక్కెట్లు ధరలంటూ, మరోసారి థియేటర్ల కేటాయింపు సమస్యలంటూ గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఏదో విధంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షతన నేడు తెలుగు నిర్మాతలు అందరూ సమావేశం అయ్యారు. నిర్మాతల మండలి ఎన్నికలు విషయమై ఈ సమావేశం జరిగింది.

Producers council members anger against C Kalyan
Tollywood : తెలుగు చిత్రసీమలో రోజుకో సమస్య తెరపైకి వస్తుంది. ఒకసారి టిక్కెట్లు ధరలంటూ, మరోసారి థియేటర్ల కేటాయింపు సమస్యలంటూ గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఏదో విధంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షతన నేడు తెలుగు నిర్మాతలు అందరూ సమావేశం అయ్యారు. నిర్మాతల మండలి ఎన్నికలు విషయమై ఈ సమావేశం జరిగింది.
Rana Daggubati: ట్రైన్ టికెట్ టైగర్ అంటూ కన్ఫ్యూజన్ పడేసిన రానా..!
నిర్మాతల మండలి ఎన్నికలు రెండేళ్లకి ఒకసారి జరగాల్సి ఉంది. కానీ గత 5 ఏళ్లగా ఈ ఎన్నికలు జరగపోవడంతో, చిన్న నిర్మాతలు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘ఇప్పటి వరకు కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోయాము అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, మరి ఎన్నికలు ఎందుకు జరపడం లేదు’ అని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ని ప్రశ్నించారు.
దీంతో సి.కళ్యాణ్‌కి, నిర్మాతల మండలి సభ్యులు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మీరొక పనికిరాని ప్రెసిడెంట్ అంటే, నువ్వొక పనికిరాని మెంబర్ అంటూ ఒకరిని ఒకరు దూషించుకున్నారు. మరి దీనిపై సినీపెద్దలు ఎవరైనా స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి.