Rana Daggubati: ట్రైన్ టికెట్ టైగర్ అంటూ కన్ఫ్యూజన్ పడేసిన రానా..!

టాలీవుడ్ హల్క్‌గా పేరుతెచ్చుకున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకునన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, రానా ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు.

Rana Daggubati: ట్రైన్ టికెట్ టైగర్ అంటూ కన్ఫ్యూజన్ పడేసిన రానా..!

Rana Daggubati Announces His Next Train Ticket Tiger

Rana Daggubati: టాలీవుడ్ హల్క్‌గా పేరుతెచ్చుకున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకునన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, రానా ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు.

Rana Daggubati : రానాకు సారీ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్..

తాజాగా ‘ట్రైన్ టికెట్ టైగర్’ అనే టైటిల్‌ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌‌గా అనౌన్స్ చేశాడు ఈ హీరో. టికెట్ కలెక్టర్ అవతారంలో రానా తన లేటెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు తెలియజేస్తామంటూ రానా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో రానా నటించే ఈ ప్రాజెక్ట్ సినిమానా, లేక వెబ్ సిరీస్ అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ టైటిల్ ఆయన దేనికి వాడుతున్నారా అని అభిమానులు కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.

Actor Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్‎పై మండిపడ్డ రానా

ఇక ఇప్పటికే రానా తన నెక్ట్స్ ప్రాజెక్టును తన బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌ను రెడీ చేశాడు. షూటింగ్ పనులు ముగించుకున్న ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. మరి రానా రేపు చెబుతానంటోన్న ‘ట్రైన్ టికెట్ టైగర్’ దేనికి సంబంధించిందో చూడాలి.