Project-K Movie Update By Swapna Dutt
Project-K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా.. అసలు ఈ సినిమా ప్రోగ్రెస్ ఏమిటని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
అయితే, తాజాగా ఈ చిత్ర ప్రోగ్రెస్‌పై నిర్మాత స్వప్నా దత్ క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న స్వప్నా దత్ ఓ ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్-K మూవీకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయ్యిందని.. అమెరికాకు చెందిన పలు వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్ర గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నాయని.. షూటింగ్‌తో పోల్చితే వీఎఫ్ఎక్స్ పనులకే ఎక్కువ సమయం పడుతుందని.. ఈ సినిమాను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఈ అప్డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్-K మూవీ కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Project-K: ప్రభాస్ సినిమా.. ఆలోచిస్తేనే థ్రిల్లింగ్ గా ఉందన్న దీపికా!
ఇక ప్రాజెక్ట్-K మూవీని 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈ సినిమాలో పలువురు పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.