పవర్ స్టార్ పాటొచ్చేస్తుంది..

PSPK 26 - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డీటేల్స్..

  • Published By: sekhar ,Published On : February 26, 2020 / 12:07 PM IST
పవర్ స్టార్ పాటొచ్చేస్తుంది..

Updated On : February 26, 2020 / 12:07 PM IST

PSPK 26 – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డీటేల్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘పింక్’ రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా PSPK 26 కి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌ను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.

లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన పాటను రేపు (గురువారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వేసవి కానుకగా మే 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.