Psycho Thriller Artiste Movie Trailer Released
Artiste Trailer : సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాణంలో రతన్ రిషి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆర్టిస్ట్ సినిమా ఈ నెల 21న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఆర్టిస్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఈవెంట్ ను నిర్వహించారు.
Also Read : Santhana Prapthirasthu Teaser : ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ వచ్చేసింది.. భార్యను ప్రెగ్నెంట్ చేసేందుకు..
ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ వ్యక్తి మర్డర్స్ చేస్తున్నట్టు చూపించారు. అలాగే అతని ప్రేమ కథ, ఇంకో వ్యక్తి కూడా మర్డర్స్ చేసినట్టు చూపించారు. వరుసగా అమ్మాయిలు హత్యకు గురువవుతూ ఉంటారు. ట్రైలర్ లో కథ ఏంటి తెలియకుండా బాగానే కట్ చేసారు. మీరు కూడా ఆర్టిస్ట్ ట్రైలర్ చూసేయండి..
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ.. ఒక సినిమా చేసి రిలీజ్ చేయడం సులువైన విషయం కాదు. నేను యూఎస్ నుంచి ఈ మూవీ కోసం ఎన్నోసార్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని నా కోరిక. అందుకే నేను న్యూ కమర్స్ తో సినిమాలు చేస్తున్నాను. ఇది మా రెండో సినిమా. ఫ్యూచర్ లో కూడా సినిమాలు చేస్తాం. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మార్చ్ 21న మా సినిమా రిలీజ్ అవుతుంది. సొసైటీకి కావాల్సిన మంచి కంటెంట్ తో సినిమా చేశాం అని అన్నారు.
Also Read : Raa Raja : ఆర్టిస్టుల ఫేస్ లు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’.. హారర్ సినిమా మూడు రోజుల్లో..
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ.. సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ ను ఈ సినిమాలో చూపించాము. సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆర్టిస్ట్ సినిమా చూశాక ఎవరూ రొటీన్ గా ఉందని అనరు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మా డైరెక్టర్ చెప్పినట్టు నటించాను. నిర్మాత ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలి అని అన్నారు. డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ.. ఆర్టిస్ట్ ఒక సైకో థ్రిల్లర్ సినిమా. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్.. అన్ని ఉన్నాయి. సినిమా చివరి 20 నిమిషాలు హై ఉంటుంది. చివరకు ఒక మంచి ఫీల్ తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. ట్రైలర్ లో వయలెన్స్ ఎక్కువగా ఉందని మీకు అనిపించవచ్చు. మూవీలో ఇంత వయలెన్స్ ఉండదు. సైకో థ్రిల్లర్స్ అంటే హత్య జరిగిన తర్వాత కిల్లర్ ఎవరనేది కథ సాగుతుంది. కానీ మా సినిమాలో విలన్ ఎవరో చెప్పే భయపెట్టే ప్రయత్నం చేశాం అని అన్నారు.