Puneeth Rajkumar : కొడుకులు లేకపోవడంతో.. పునీత్ రాజ్ కుమార్‌కి ఖననం జరిపేది ఇతనే
ఇవాళ ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేరు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు వందిత, ధృతి. దీంతో పునీత్ తలకొరివి

Vinay Rajkumar
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కర్ణాటకని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. అమెరికాలో ఉన్న ఆయన కూతురు వచ్చాకే అంతక్రియలు జరపాలని అనుకోవడంతో నిన్న జరగాల్సిన చివరి కార్యక్రమాలు నేటికి వాయిదా పడ్డాయి. అమెరికాలో ఉన్న ఆయన కూతురు ధృతి నిన్న రాత్రికి బెంగళూరుకు వచ్చింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పునీత్ కూతురు తండ్రి మరణ వార్తతో పుట్టెడు దుఃఖంతో భారత్ కి వచ్చింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన ఆమెకు ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా పోలీసులు స్పెషల్ రూట్ లో కంఠీరవ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అంతక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..
పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేరు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు వందిత, ధృతి. దీంతో పునీత్ అంతిమ సంస్కారాలు నిర్వహించే బాధ్యతను ఆయన అన్న కొడుకు వినయ్ రాజ్‌కుమార్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని పునీత్ కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈయన కుమారుడు వినయ్ చేతుల మీదుగానే.. బాబాయ్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరిగాయి. అంతిమ సంస్కారాల్లో తెల్లని వస్త్రాలు ధరించి… వినయ్ పాల్గొన్నాడు. వినయ్ కూడా ఇప్పటికే హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. వినయ్ హీరోగా ఎదగడానికి బాబాయ్ పునీత్ ఎంతగానో సహాయపడ్డాడు.