Puri Jagannadh: లైగర్ ఎఫెక్ట్.. ‘ఇస్మార్ట్’గా తప్పుకున్న హీరో.. ఇక మిగిలింది ఆయనేనా..?

లైగర్ మూవీ తరువాత పూరి జగన్నాధ్ తన నెక్ట్స్ మూవీని రామ్ పోతినేనితో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.

Puri Jagannadh: లైగర్ ఎఫెక్ట్.. ‘ఇస్మార్ట్’గా తప్పుకున్న హీరో.. ఇక మిగిలింది ఆయనేనా..?

Puri Jagannadh Next Movie Not With Ram Pothineni

Updated On : May 3, 2023 / 5:53 PM IST

Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న విజయ్ దేవరకొండ, ఈ చిత్రానికి వచ్చిన రిజల్ట్‌తో స్లో అయిపోయాడు. ఇక పూరి కూడా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నా, చిత్ర రిజల్ట్‌తో అవన్నీ ఆవిరయిపోయాయి. అయితే, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు.

Puri Jagannadh : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేదా పైసా వసూల్ సీక్వెల్.. పూరి నెక్స్ట్ ఏంటి??

కాగా, పూరి తన తరువాత చిత్రాన్ని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా రామ్‌తో చేయాలని పూరి ప్రయత్నిస్తున్నాడు. అయితే రామ్ మాత్రం పూరితో సినిమా చేసేందుకు ప్రస్తుతం ఆసక్తిగా లేనట్టుగా తెలుస్తోంది. దీంతో పూరి తన నెక్ట్స్ మూవీని నందమూరి బాలకృష్ణతో చేయాలని చూస్తున్నాడు.

Puri Jagannadh: మరోసారి ఆకాష్ కోసం కథ రెడీ చేసిన పూరి..?

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘పైసా వసూల్’ మూవీ వచ్చింది. ఈ సినిమా పూరి కెరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత పూరితో బాలయ్య మరో సినిమా చేస్తాడని గతంలోనే వార్తలు వచ్చాయి. అందుకే, ఇప్పుడు బాలయ్యతో తన నెక్ట్స్ మూవీని తీసి, ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు ఈ డైరెక్టర్. మరి బాలయ్య పూరికి ఛాన్స్ ఇస్తాడా లేడా అనేది చూడాలి.