Allu Arjun: అబుదాబిలోని ఆ మందిరంలో అల్లు అర్జున్.. వీడియో చూశారా?
బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ హిందూ సంస్కృతికి, ఆధ్యాత్మికత, శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అబుదాబిలో స్వామి నారాయణ్ మందిర్‌ను సందర్శించుకున్నాడు. ఆలయ నిర్మాణాలను బన్నీ ఆసక్తిగా పరిశీలించాడు. ఆల్లు అర్జున్‌కి ఆలయ ప్రతినిధులు ఆలయ విశిష్టతలను గురించి వివరించారు.
బన్నీ ఆలయ సందర్శనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రాచ్యంలోనే స్వామి నారాయణ్ మందిర్ తొలి సాంప్రదాయిక రాతి మందిరం. దీని ప్రారంభోత్సవం గత ఏడాది ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది.
Also Read: మలయాళంలో గళగళ మాట్లాడి అదరగొట్టేసిన జర్మన్ మహిళ.. ఆశ్చర్యచకితుడైన ఉబర్ డ్రైవర్
బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ హిందూ సంస్కృతికి, ఆధ్యాత్మికత, శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయాలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బోచ్‌సన్‌వాసీ అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో అది పెద్ద హిట్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో తన తదుపరి సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీని త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా రావాల్సి ఉంది.
Allu Arjun visits the Abu Dhabi Temple #AbuDhabiMandir #AlluArjun pic.twitter.com/zLClNYz8er
— Viral Update (@viralupdate63) March 23, 2025