Viral Video: మలయాళంలో గళగళ మాట్లాడి అదరగొట్టేసిన జర్మన్‌ మహిళ.. ఆశ్చర్యచకితుడైన ఉబర్‌ డ్రైవర్

విదేశీయులు ఇలా మలయాళంలో మాట్లాడడాన్ని తాను ఎన్నడూ వినలేదని అన్నాడు.

Viral Video: మలయాళంలో గళగళ మాట్లాడి అదరగొట్టేసిన జర్మన్‌ మహిళ.. ఆశ్చర్యచకితుడైన ఉబర్‌ డ్రైవర్

Updated On : March 23, 2025 / 2:42 PM IST

సాధారణంగా కొందరు ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు విదేశీయులతో ఇంగ్లిష్‌లో గళగళామాట్లాడి షాక్ ఇస్తుంటారు. కానీ, కేరళలో తాజాగా సీన్ రివర్స్‌ అయింది. ఓ విదేశీయురాలు మలయాళంలో గళగళ మాట్లాడి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

జర్మన్ టీచర్ల క్లారా భారత్‌లో నివసిస్తోంది. తాజాగా ఆమె ఉబర్‌ క్యాబ్ ఎక్కింది. ఆమె మలయాళంలో స్థానికురాలిలా క్యాబ్‌ డ్రైవర్‌తో మాట్లాడిన తీరు అబ్బురపర్చింది. ఆ సమయంలో వీడియో కూడా తీసుకుంది.

Also Read: ఊబకాయం, మధుమేహం బాధితులకు శుభవార్త.. ఒక్క ఇంజెక్ష‌న్‌తో రెండింటినీ నియంత్రించొచ్చు..

క్యాబ్ ఎక్కాక ఆమె మలయాళంలో మాట్లాడడం విన్న క్యాబ్‌ డ్రైవర్‌.. తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. విదేశీయులు ఇలా మలయాళంలో మాట్లాడడాన్ని తాను ఎన్నడూ వినలేదని అన్నాడు.

ఉబర్‌ డ్రైవర్లతో మలయాళంలో మాట్లాడుతున్న సమయంలో వారు చాలా ఆసక్తి చూస్తూ ప్రతిస్పందిస్తారని క్లారా చెప్పింది. అందుకే తాను ఇప్పుడు ఇలా డ్రైవర్‌తో జరిపిన సంభాషణను వీడియో తీస్తున్నానని తెలిపింది.

ఆమె మలయాళం నేర్చుకుని మాట్లాడుతున్న తీరును నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. “ఆమె నా కంటే బాగా మలయాళం మాట్లాడుతోంది” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆమె ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నాడు.