Pushpa 2: పుష్ప-2 మానియా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ..

Allu Arjun Pushpa 2 The Rule
Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో బుధవారం రాత్రి నుంచే సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలను వేశారు. భారీ సంఖ్యలో అభిమానులు సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు తరలివచ్చారు. దీంతో థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానులతో కోలాహలం నెలకొంది. పలు థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు.
కొందరు అభిమానులు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ గెటప్ తో థియేటర్లకు వచ్చారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో హీరో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. బుధవారం రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడితో కోలాహలంగా మారింది.
Also Read: Pushpa 2 Twitter Review : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉంది? అభిమానులు ఏమంటున్నారు?