Pushpa 2 star Allu Arjun at Khairatabad RTO office Photo gone viral
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియన్స్ అంతా ఈ మూవీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. బన్నీ కూడా ఆ సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు తెగ కష్ట పడుతున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో కనిపించారు. డ్రైవింగ్ లైసెన్స్ పని మీద అక్కడికి వచ్చారు.
డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇక్కడి రోడ్లు మీద తిరగడానికి అనుకుంటున్నారేమో.. అసలు కాదండోయ్. విదేశీ రోడ్డులో చక్కర్లు కొట్టేందుకు అల్లు అర్జున్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నారు. ఇందుకోసమే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. రూల్స్ ప్రకారం లైసెన్స్ కోసం చేయవల్సిన ప్రోసిజర్ ని ఆఫీసర్స్ ని కనుకొని అల్లు అర్జున్ పూర్తి చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also read : Rajamouli : ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ మీరు చూసింది కాదు.. మొదటి అనుకున్న స్టోరీలో కొమరం భీమ్..
కాగా పుష్ప 2 షూటింగ్ ని జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశాల్లో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఏ అంచనాలు లేకుండా వచ్చిన పార్టు 1తోనే సంచలనాలు సృష్టించిన పుష్ప టీం.. ఇప్పుడు భారీ అంచనాలు మధ్య వస్తున్న ఈ సెకండ్ పార్టుతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఏపీలోని యాగంటి పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. అల్లు అర్జున్ అండ్ రష్మిక పై వచ్చే ముఖ్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆరోజు సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.