Fahadh Faasil : బాహుబలి నిర్మాణ సంస్థలో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమాలు.. బాలయ్య డైలాగ్‌తో ఒక సినిమా టైటిల్..

బాహుబలి నిర్మాణ సంస్థలో ఫహద్ ఫాజిల్ తన కొత్త సినిమాలను అనౌన్స్ చేసారు. వాటిలో ఒక చిత్రానికి బాలయ్య డైలాగ్‌ని టైటిల్ గా పెట్టారు.

Fahadh Faasil : బాహుబలి నిర్మాణ సంస్థలో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమాలు.. బాలయ్య డైలాగ్‌తో ఒక సినిమా టైటిల్..

Pushpa 2 star Fahadh Faasil announce his next project in baahubali production company

Updated On : March 19, 2024 / 7:39 PM IST

Fahadh Faasil : మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని లాంగ్వేజ్స్ అన్నిటిలో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోతున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తున్న ఈ మలయాళ నటుడు.. ఇప్పుడు తెలుగులో మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేసారు. ఈ రెండు చిత్రాలు బాహుబలి నిర్మాణ సంస్థలోనే కావడం విశేషం.

‘ఆక్సిజన్’ అనే టైటిల్ లో ఓ సినిమాని అనౌన్స్ చేసారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫ్రెండ్‌షిప్ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. సిద్దార్థ నాదెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూనే రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మాస్క్ తో ఉన్న ఫహద్ ఫాజిల్ పేస్ ని పోస్టర్ లో చూపించారు. ఇది చూస్తుంటే.. కరోనా సమయంలో చోటు చేసుకున్న కథ అని తెలుస్తుంది.

Also read : Ram Charan : వైజాగ్ బీచ్‌లో కూతురు క్లీంకారతో రామ్ చరణ్.. వీడియో వైరల్..

ఇక మరో సినిమాకి బాలయ్య డైలాగ్ ని టైటిల్ గా పెట్టారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఎమోషనల్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. ఫహద్ తో పాటు ఈ సినిమాలో ఒక చిన్న పిల్ల పాత్ర కూడా ప్రధానంగా ఉండబోతుంది. మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో.. ఫహద్ అండ్ ఒక చిన్న పాప పోలీస్ కారు పై కనిపిస్తున్నారు. పాప చేతిలో ఒక మంత్రదండం కనిపిస్తుంది. శశాంక్ ఏలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్స్ అండ్ టైటిల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ చిత్రాలను ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి. కాగా ఫహద్ పుష్ప 2 సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఆగష్టులో రిలీజ్ కి సిద్దమవుతుంది.