Rashmika Mandanna : మరో కాంట్రవర్సీలో చిక్కుకున్న రష్మిక.. చికెన్ తెచ్చిన సమస్య ఏంటో తెలుసా?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా చికెన్ తెచ్చిన సమస్యలో ఇరుకుంది. ఆ కథ ఏంటో చూసేయండి.

Pushpa 2 star Rashmika Mandanna facing another controversy

Rashmika Mandanna : సౌత్ స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగిన రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. దీంతో నేషనల్ వైడ్ ఈ అమ్మడికి ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ స్టార్‌డమ్ ని పలు బ్రాండ్స్ తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ కి అంబాసడర్ గా వ్యవహరించిన రష్మిక.. తాజాగా ఒక ఫుడ్ ఐటెం కోసం ఒక కమర్షియల్ యాడ్ చేసింది. ప్రముఖ బర్గర్ బ్రాండ్ యాడ్ లో నటించిన రష్మిక స్పైసీ చికెన్ బర్గర్‌ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

Rashmika Mandanna : రష్మిక ఆ హీరోలకు నో చెప్పిందా??

ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయ్యింది. అయితే రష్మిక గతంలో తాను ఒక శాఖాహారిని అంటూ పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు చికెన్ బర్గర్ ని తింటూ ఒక యాడ్ చేయడంతో ఆమె పై నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు. ఆమె అభిమానులు సైతం తమని మోసం చేయవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న రష్మిక ఈ కాంట్రవర్సీ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Rashmika Mandanna : సమంత సినిమా రష్మికకు వచ్చిందా? రెయిన్‌బో నిర్మాత ఏమన్నాడు?

ఇక ఈ అమ్మడి సినిమాలు విషయానికి వస్తే బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ (Animal) అనే సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో పుష్ప 2 (Pushpa 2), నితిన్ తో ఒక సినిమా, అలాగే రైన్‌బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్న యానిమల్, పుష్ప 2 పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాలతో రష్మిక ఇంకెంతటి స్టార్‌డమ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.