Rashmika Mandanna : సమంత సినిమా రష్మికకు వచ్చిందా? రెయిన్‌బో నిర్మాత ఏమన్నాడు?

రెయిన్‌బో సినిమాకి ముందు సమంతని అనుకోని ఆ తర్వాత రష్మిక ని తీసుకున్నారని సమాచారం. సమంత నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika Mandanna : సమంత సినిమా రష్మికకు వచ్చిందా? రెయిన్‌బో నిర్మాత ఏమన్నాడు?

Rashmika Mandanna Rainbow Movie first offered to Samantha

Rashmika Mandanna :  తాజాగా సోమవారం నాడు రష్మిక మెయిన్ లీడ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రారంభమైంది. రెయిన్‌బో అనే ఈ సినిమాని శాంతరూబన్ తెరకెక్కిస్తుండగా డ్రీం వారియర్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇది రష్మికకు మొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. అలాగే ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రెయిన్‌బో తెరకెక్కబోతుంది.

సోమవారం నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ సినిమాకి ముందు సమంతని అనుకోని ఆ తర్వాత రష్మిక ని తీసుకున్నారని సమాచారం. సమంత నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ సినిమాని సమంతతోటే అనుకున్నారట కానీ ఇపుడు రష్మిక చేస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు ఎందుకు సమంత బదులు రష్మికని తీసుకున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Balagam issue : దిల్‌రాజు వర్సెస్ అమెజాన్.. బలగం వివాదం.. ప్రేక్షకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిల్‌రాజు..

అయితే ఈ సినిమా పూజా కార్యక్రమంలో సినిమా నిర్మాత దీనిపై స్పందించారు. మీడియా సమంత బదులు ఈ సినిమాకి రష్మికని తీసుకున్నారా అని అడగగా నిర్మాత ప్రభు మాట్లాడుతూ.. స్క్రిప్ట్ కి ఎవరు సరిపోతారో వాళ్లనే ఎంపిక చేసుకుంటాం. కంటెంట్ బట్టి ఆర్టిస్టులని తీసుకుంటారు. కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వాటిని ఎవరూ మార్చలేరు అని చెప్పాడు. దీంతో డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇది సమంత వద్దకు వెళ్లి ఆ తర్వాత రష్మిక వద్దకు వచ్చినట్టు అర్ధమవుతుంది. మరి దీనిపై రష్మిక ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.