Pushpa 2: ఇంకా రెండు లుక్స్ ఉన్నాయట.. పూనకాలు ఖాయం.. నిజమేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’లో గంగమ్మతల్లి లుక్‌లో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేక్ చేస్తోంది.

Pushpa 2 To Have Two More Dashing Looks
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందే సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ వీడియో క్లిప్‌కు నెట్టింట ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం చూస్తున్నాం. అంతేగాక, గంగమ్మతల్లి లుక్‌లో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ షేక్ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బన్నీ కనిపించడంతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చాయి.
Pushpa 2 : పుష్ప 2 సినిమాపై సుకుమార్ వైఫ్ రియాక్షన్
ఇక ఈ లుక్‌పై ఇంకా ఆసక్తి తగ్గకముందే, ఈ సినిమాలో బన్నీ లుక్స్ గురించి తాజాగా నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో గంగమ్మతల్లి లుక్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా వస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ లుక్‌తో పాటు బన్నీని మరో రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో చూపెట్టేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడట. ఈ లుక్స్‌ను కూడా ఎవరూ ఊహించని విధంగా సుక్కు డిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Pushpa 2 : పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందా?? ఈ సారి సమంత ప్లేస్ లో ఎవరు?
ఈ లుక్స్‌లో బన్నీని చూస్తే పూనకాలు రావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ లుక్స్‌ను సినిమాలో చాలా సీరియస్ సీక్వెన్స్‌లలో రివీల్ చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే బన్నీని మరో రెండు లుక్స్‌లో చూపెట్టి, ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాలి. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సినిమా క్రేజ్ అమాంతం ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.