Allu Arjun : 69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణ.. అల్లు అర్జున్ నిజం చేసి చూపించాడు..

69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణకు అల్లు అర్జున్ తెరదించుతూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. ఇన్నాళ్లు ఒక తీరని కలలా ఉన్న..

Allu Arjun : 69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణ.. అల్లు అర్జున్ నిజం చేసి చూపించాడు..

Pushpa Allu Arjun bring first Best Actor National award to Tollywood

Allu Arjun : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు భారతీయ ప్రభుత్వం అందించే ‘నేషనల్ అవార్డ్స్’ (National Film Awards 2023). ఈ పురస్కారంలో అనేక క్యాటగిరిలో సినిమా యాక్టర్స్‌కు, టెక్నీషియన్స్ కి అవార్డులు ప్రకటిస్తుంటారు. ఇక 69 ఏళ్ళ జాతీయ పురస్కారంలో తెలుగు వారికీ ఒక లోటు మిగిలిపోయింది. ఇప్పటివరకు తెలుగు సినిమా పలు కేటగిరిలో అవార్డులు అందుకున్నా.. బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రం అందుకోలేకపోయింది.

National Film Awards 2023 : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు.. పుష్ప తగ్గేదేలే..

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది గొప్ప ప్రతిభ ఉన్న హీరోలు ఉన్నారు. వారి గొప్ప నటనతో ఆడియన్స్ మనసుని దోచుకున్నప్పటికీ ఇప్పటివరకు ఏ హీరో బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకోలేకపోయారు. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ కూడా అసంతృప్తి చూపిస్తుంటారు. అవార్డు ఇచ్చే అర్హత ఉన్న ఇవ్వడం లేదని జ్యూరీ పై విమర్శలు కూడా చేసేవారు. అయితే ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ ఆశ ఫలించింది. 69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణకు అల్లు అర్జున్ తెరదించుతూ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నాడు.

National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..

2021 గాను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డులు ప్రకటిస్తూ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరుని అనౌన్స్ చేసింది. పుష్ప ది రైస్ (Pushpa 1) సినిమాకు గాను బన్నీకి అవార్డుని ప్రకటించారు. ఈ అవార్డు రావడం అనేది అల్లు అర్జున్ లేదా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. తెలుగు వారందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఇన్నాళ్ల కల నెరవేరడంతో అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంట వద్ద పండుగా వాతావరణం నెలకుంది. ఇండస్ట్రీ, అభిమానులు నుంచి అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.