Pushpa : అల్లు అర్జున్ విలన్‌గా ఫహద్ ఫాజిల్… First Look
అల్లు అర్జున్ హీరోగా రెడీ అవుతున్న పుష్ప సినిమాకు విలన్ గా పహద్ ఫాజిల్ ఏ పార్ట్ లో ఉంటాడో అని సందేహం క్రియేట్ చేసింది టీం. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ శనివారం....

Pushpa Villan
Pushpa: అల్లు అర్జున్ హీరోగా రెడీ అవుతున్న పుష్ప సినిమాకు విలన్ గా పహద్ ఫాజిల్ ఏ పార్ట్ లో ఉంటాడో అని సందేహం క్రియేట్ చేసింది టీం. ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ శనివారం విలన్ ఫస్ట్ లుక్ వదిలేసింది. అంతేకాకుండా విలన్ పాత్ర పేరును కూడా ప్రకటించింది. పుష్పలో విలన్ గా భన్వర్ సింగ్ షెకావత్ అని అనౌన్స్ చేసింది.
ఫహద్ పాజిల్ పోషిస్తున్న ఈ పాత్రలో ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేసిన సినిమా యూనిట్.. తగ్గేదే లే #ThaggedheLeఅనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే..ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు టాక్. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అక్టోబరులో ఒక పార్ట్ విడుదల కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.