నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక అవార్డ్

గత దశాబ్దకాలంగా ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-2019 కమిటీ ఆర్.నారాయణ మూర్తిని అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది..

  • Published By: sekhar ,Published On : April 23, 2019 / 11:30 AM IST
నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక అవార్డ్

Updated On : April 23, 2019 / 11:30 AM IST

గత దశాబ్దకాలంగా ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-2019 కమిటీ ఆర్.నారాయణ మూర్తిని అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది..

సొసైటీలోని బర్నింగ్ ఇష్యూస్‌ని, సామాజిక అంశాలను కథలుగా ఎంచుకుని, వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిని చైతన్య పరిచే సినిమాలను నిర్మిస్తున్న రెడ్ స్టార్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తిని ఒక ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. గత దశాబ్దకాలంగా ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-2019 అవార్డులను ప్రకటించింది. ఆర్.నారాయణ మూర్తిని అవార్డుకు ఎంపిక చేసినట్టు కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, నిర్మాత సి.కళ్యాణ్, ఈటివి, టివి9 లకు ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డులను అందచెయ్యనున్నారు.

వీరితోపాటు లయన్ ఎ.విజయ్ కుమార్ (సాంసృతిక), పి.ప్రసాదరావు (హస్తకళ), జిత్ మోహన్ మిత్ర (సంగీతం, నటన), పి.యుగంధర్(కార్మిక సేవ) లకు కూడా అవార్డులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 28న రాజమహేంద్రవరంలోని, విక్రమ్ హాలులో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.