Reddy Chittemma : ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం

తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇంట విషాదం నెలకొంది. అయితే ఆర్ నారాయణమూర్తి మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ తన స్వస్థలం రౌతుపూడి మండలం, మల్లంపేటలో.......

Reddy Chittemma : ఆర్ నారాయణమూర్తికి మాతృ వియోగం

R Naryanamurthy

Updated On : July 5, 2022 / 12:44 PM IST

R Narayana Murthy :  ప్రజా సమస్యలపై సినిమాలు తీసి అనేక విజయాలు సాధించారు ఆర్ నారాయణ మూర్తి. హీరోగా, ఆర్టిస్ట్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా సక్సెస్ అయి పీపుల్స్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంత సక్సెస్ సాధించినా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు ఆర్ నారాయణ మూర్తి. సినిమాలే కాక తన ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పెళ్లి చేసుకోకుండా సినిమాలకి, సమాజానికి ఆయన జీవితం అంకితమిచ్చారు.

Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..

తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇంట విషాదం నెలకొంది. అయితే ఆర్ నారాయణమూర్తి మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ తన స్వస్థలం రౌతుపూడి మండలం, మల్లంపేటలో నివసిస్తుంది. గత కొంత కాలం నుంచి వయసుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంది. మంగళవారం ఉదయం ఆమె సొంత స్వస్థలంలో 93వ ఏట కన్నుమూశారు. దీంతో నారాయణమూర్తి ఇంటికి పయనమయ్యారు. ఆ ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలని చిట్టెమ్మ దగ్గరుండి నిర్వహించింది. దీంతో ఊరంతా విషాదంలో మునిగింది. ఆర్ నారాయణ మూర్తికి మాతృ వినియోగం జరిగిందని తెలిసి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.