Raai Laxmi : రాయ్ లక్ష్మీ కాలికి గాయం, ఫొటోలు వైరల్

టాలీవుడ్ నటి లక్ష్మీ రాయ్ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రమాదానికి గురైంది.

Raai Laxmi : రాయ్ లక్ష్మీ కాలికి గాయం, ఫొటోలు వైరల్

Action Shoot in Hyderabad

Updated On : March 21, 2021 / 5:41 PM IST

injured during the shoot : టాలీవుడ్ నటి లక్ష్మీ రాయ్ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా..ఆమె ఒక్కసారిగా కిందపడిపోయిందని తెలుస్తోంది. ఈమె కాలికి గాయమైంది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మార్చి 20వ తేదీ అర్ధరాత్రి బంజారాహిల్స్ లో 2 గంటల సమయంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో…రాయ్ లక్ష్మీ కిందపడిపోయిందని సమాచారం. కాలికి బలమైన గాయమైందని ఫొటోను చూస్తే తెలుస్తోంది. షూటింగ్ వెంటనే ఆపివేసి..లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలను

తెలుగులో బాలకృష్ణ ‘అధినాయకుడు’ సినిమాలో రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. కానీ..తర్వాత..సినిమాల ఆఫర్స్ రాలేదు. దీంతో ఐటం సాంగ్స్ చేయడం ప్రారంభించింది. బలుపు, సర్ధార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసి యూత్ కిక్కెచ్చింది. ఫుల్ బిజీ అయిపోయింది. Rinku Gupta ట్విట్టర్ వేదికగా..ఫొటోలను ట్వీట్ చేశారు.