ఝాన్సీగా రాబోతున్న రత్తాలు

ప్రస్తుతం వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ సినిమా చేస్తున్న రాయ్ లక్ష్మీ, కన్నడలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.

  • Published By: sekhar ,Published On : January 10, 2019 / 10:05 AM IST
ఝాన్సీగా రాబోతున్న రత్తాలు

Updated On : January 10, 2019 / 10:05 AM IST

ప్రస్తుతం వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ సినిమా చేస్తున్న రాయ్ లక్ష్మీ, కన్నడలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.

రాయ్ లక్ష్మీ, తెలుగులో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా, బ్రేక్ మాత్రం రాలేదు. మెగాస్టార్ చిరంజీవి పక్కన రత్తాలు పాటకి ఆడిపాడాక కాస్త గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ సినిమా చేస్తున్న రాయ్ లక్ష్మీ, కన్నడలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది. తెలుగులో ఝాన్సీ పేరుతో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా నుండి రాయ్ లక్ష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌లో చేతిలో కాగడా పట్టుకుని, సీరియస్‌గా చూస్తుంది రాయ్ లక్ష్మీ.. కాగడా చుట్టూ నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో మెరుపుల మధ్య ఉగ్ర రూపంలో కనబడుతుంది రాయ్ లక్ష్మీ.

భవాని ఎంటర్‌‌టైన్‌మెంట్ సమర్పణలో, రాజేష్ కుమార్ నిర్మిస్తుండగా, పి.వి.ఎస్.గురుప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాయ్ లక్ష్మీ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్న ఝాన్సీ త్వరలో రిలీజ్ అవనుంది. ఈ సినిమాకి సంగీతం : ఎమ్,ఎన్.కృపాకర్, కెమెరా : వీరేష్ ఎన్.టి.ఎ, ఎడిటింగ్ : బస్వరాజ్, ఫైట్స్ : థ్రిల్లర్ మంజు.